సూపర్ సిక్స్‌లోకి ‘దిశ’ టీమ్
హైదరాబాద్: 7 హెచ్ మీడియా ప్రీమియర్ లీగ్(ఎంపీఎల్) రెండో సీజన్‌లో భాగంగా జరుగుతున్న టీ20 మ్యాచ్‌ల్లో అరంగేట్ర జట్టు ‘దిశ’ అదరగొడుతోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుత విజయాలు సాధించి సూపర్ సిక్స్‌లోకి దూసుకెళ్లింది. ఇక మార్చి మొదటివారంలో ఏబీఎన్‌తో జరిగే మ్యాచ్‌లోనూ గెలిస్తే సెమీస్‌లోకి వెళ్లడం ఖాయం. నగరంలోని ఎంఎల్ఆర్ క్రీడా మైదానంలో ఎన్టీవీతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో దిశ జట్టు 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు […]
హైదరాబాద్: 7 హెచ్ మీడియా ప్రీమియర్ లీగ్(ఎంపీఎల్) రెండో సీజన్‌లో భాగంగా జరుగుతున్న టీ20 మ్యాచ్‌ల్లో అరంగేట్ర జట్టు ‘దిశ’ అదరగొడుతోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుత విజయాలు సాధించి సూపర్ సిక్స్‌లోకి దూసుకెళ్లింది. ఇక మార్చి మొదటివారంలో ఏబీఎన్‌తో జరిగే మ్యాచ్‌లోనూ గెలిస్తే సెమీస్‌లోకి వెళ్లడం ఖాయం.
నగరంలోని ఎంఎల్ఆర్ క్రీడా మైదానంలో ఎన్టీవీతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో దిశ జట్టు 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిశ టీమ్‌కు ఏమాత్రం శుభారంభం దక్కలేదు. బ్యాట్స్‌మెన్ వచ్చినోళ్లు వచ్చినట్టుగా పెవీలియన్ బాటపట్టారు. ప్రత్యర్థి బౌలర్లు అశోక్(5/14), వినయ్(2/16) ధాటికి ఓపెనర్ సతీశ్(0) సహా తర్వాతి బ్యాట్స్‌మెన్ వెంకటేశ్(1), మధు(0), మహేశ్(0) వెంటవెంటనే అవుటయ్యారు. 14 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును మరో ఓపెనర్ స్వామి, సాయి కుమార్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వీరి జోడీ ఐదో వికెట్‌కు 16 పరుగులు జోడించింది. మంచి టచ్‌లో కనిపించిన ఈ జోడీని సాయికుమార్(4)ను అవుట్ చేసి, దినేశ్ విడదీశాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే స్వామి(19) సైతం బౌలర్ సుబ్బుకు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కె.మహేశ్(16), బాలు(14) చక్కని ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 33 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. బాలు, అశోక్ బౌలింగ్‌లో బౌల్డ్ అవ్వడంతో వీరి జోడికి తెరపడింది. ఇక తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీకాంత్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 20 బంతులు ఎదుర్కొన్న శ్రీకాంత్ రెండు సిక్సులు, ఒక ఫోర్‌తో 23 పరుగులు చేసి, టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తం 17 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసిన దిశ జట్టు, 102 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.
103 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో గెలుస్తామనే దీమాతో బ్యాటింగ్ ప్రారంభించిన ఎన్టీవీ బ్యాట్స్‌మెన్‌కు, దిశ బౌలర్లు చుక్కలు చూపించారు. మధు 5/15తో రెచ్చిపోగా, సతీశ్ (2/16), కె.మహేశ్(2/21) చెలరేగడంతో ఎన్టీవీ జట్టు 11 ఓవర్లలో 65 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా దిశ టీమ్ 37 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐదు వికెట్ల తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన మధుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
7హెచ్ ఎంపీఎల్ నిర్వహించడం ఆనందంగా ఉంది: ఎంఎల్ఆర్ ప్రిన్సిపాల్
ఎంఎల్ఆర్ క్రీడా మైదానంలో 7హెచ్ ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఉందని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీనివాస్ అన్నారు. జర్నలిస్టులకు ఇలాంటి క్రీడలు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల సభ్యులను పరిచయం చేసుకుని శ్రీనివాస్ టాస్ వేశారు. ఇందులో పీఆర్వో రఘు, ఎంపీఎల్ ఆర్గనైజర్ వెంకటేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, తమ కాలేజీ క్యాంపస్‌లో క్రీడాకారులకు అన్ని రకాల వసతులు ఉన్నాయని తెలిపారు. సంస్థ ఛైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉండేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని చెప్పారు. విద్యార్థులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని నింపుతాయన్నారు. రెండో సీజన్ నిర్వహణకు ఎంఎల్ఆర్ సంస్థ గ్రౌండ్‌ను ఇవ్వడం సంతోషకరమని, ఆర్గనైజర్ వెంకటేశ్ చెప్పారు. ఇందుకు ఎంఎల్ఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.