‘దిశ ఎన్‌కౌంటర్’.. ట్రైలర్‌లోనే సినిమా
దిశ, వెబ్‌డెస్క్: 26 నవంబర్ 2019.. హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’ హత్య కేసు ఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘దిశ ఎన్‌కౌంటర్’. స్కూటీ పార్క్ చేసిన అమ్మాయిని ప్లాన్‌తో నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. ఈ స్టోరీని సినిమా కథగా తీసుకున్నారు ఆర్జీవీ. ఆనంద్ చంద్ర దర్శకత్వంలో వస్తున్న మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా, యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో దూసుకుపోతోంది. ట్రైలర్ విడుదలైన ఎనిమిది […]
దిశ, వెబ్‌డెస్క్:
26 నవంబర్ 2019.. హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’ హత్య కేసు ఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘దిశ ఎన్‌కౌంటర్’. స్కూటీ పార్క్ చేసిన అమ్మాయిని ప్లాన్‌తో నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. ఈ స్టోరీని సినిమా కథగా తీసుకున్నారు ఆర్జీవీ. ఆనంద్ చంద్ర దర్శకత్వంలో వస్తున్న మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా, యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో దూసుకుపోతోంది. ట్రైలర్ విడుదలైన ఎనిమిది గంటల్లో ఆరు లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది.
అయితే, రెండు నిమిషాల 45 సెకన్ల నిడివితో ఉన్న ట్రైలర్‌లోనే ఆర్జీవీ మొత్తం సినిమా చూపించారని.. ఇంకా సినిమాలో చూడాల్సిన విషయాలు ఏమున్నాయని చర్చిస్తున్నారు. దిశను ట్రాప్ చేసిన నలుగురు యువకులు తనను పక్కా ప్లాన్‌తో కిడ్నాప్ చేసి, గ్యాంగ్ రేప్ చేసిన ఘటనను పూర్తిగా ట్రైలర్‌లో టైమ్‌తో సహా చూపించింది మూవీ యూనిట్. కాగా, దిశ కేసులో నిందితులకు ఎలాంటి శిక్ష పడిందనేది సినిమాలో హైలెట్ చేయనుందని తెలుస్తోంది. అమ్మాయితో తప్పుగా ప్రవర్తిస్తే పడే శిక్షను చూసి ప్రతీ ఒక్కరూ భయపడాలని.. అమ్మాయిని టచ్ చేసేందుకు వణికి పోవాలనే విధంగా సినిమా ఉంటుందని సమాచారం. కాగా నట్టి క్రాంతి, నట్టి కరుణ నిర్మిస్తున్న సినిమాకు డి.ఎస్.ఆర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, సోనియా ఆకుల, ప్రవీణ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
కాగా ఈ సినిమా కథ సేకరణలో భాగంగా దిశ కేసులో నిందితుల కుటుంబాలను ఆర్జీవీ కలిసిన విషయం తెలిసిందే.