బేక్రింగ్: దిశ నిందితుల కుటుంబాలకు సిట్ నోటీసులు

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్/ మక్తల్: రెండు సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన దిశ ఎన్ కౌంటర్ సంఘటనకు సంబంధించి ఎట్టకేలకు సిట్ కమిషన్ విచారణ చేపట్టనుంది. 2019 నవంబర్ 27 న రంగారెడ్డి జిల్లా చటాన్ పల్లి వద్ద దిశ పై జరిగిన అత్యాచారం, హత్య ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని గుడిగండ్ల కు చెందిన జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు, జక్లేర్ కు చెందిన మహమ్మద్ […]

Update: 2021-08-18 06:27 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్/ మక్తల్: రెండు సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన దిశ ఎన్ కౌంటర్ సంఘటనకు సంబంధించి ఎట్టకేలకు సిట్ కమిషన్ విచారణ చేపట్టనుంది. 2019 నవంబర్ 27 న రంగారెడ్డి జిల్లా చటాన్ పల్లి వద్ద దిశ పై జరిగిన అత్యాచారం, హత్య ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని గుడిగండ్ల కు చెందిన జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు, జక్లేర్ కు చెందిన మహమ్మద్ ఆరిఫ్ ను పోలీసులు అదే నెల 29న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కేసు రీ కంస్ట్రక్షన్ లో భాగంగా 2019 డిసెంబర్ ఆరవ తేదీన తెల్లవారుజామున చటాన్పల్లి వద్దకు తీసుకురాగా నిందితులు పోలీసులపై తిరగబడి తప్పించుకునే ప్రయత్నం చేశారని పేర్కొంటూ పోలీసులు ఆ నలుగురిని ఎన్కౌంటర్ చేసిన ఘటన పాఠకులకు విధితమే.. కాగా మృతుల కుటుంబీకులు చేతికొచ్చిన తమ పిల్లలను వాళ్ళు నేరం చేశారో.. లేదో నిరూపణ కాకముందే అకారణంగా ఎన్కౌంటర్ చేసి హతమార్చారని.. తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతుల కుటుంబీకులు కోర్టును ఆశ్రయించారు.

ఈ మేరకు సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయవాదులతో కూడిన సిట్ కమిషన్ ఏర్పాటయింది. ఈ కమిషన్ ఏర్పాటు అయిన అప్పటి నుండి కోవిడ్ కారణంగా విచారణ ఆలస్యమైంది. ఇటీవల కోవిడ్ తగ్గడంతో షిఫ్ట్ కమిషన్ ఎన్ కౌంటర్ కు సంబంధించి విచారణ జరిపేందుకు సిద్ధమైంది. ఈనెల హైదరాబాదులోని హైకోర్టులో హాజరుకావాలని ఆదేశిస్తూ మృతుల కుటుంబ సభ్యులకు, మృతులు చదువుకున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక న్యాయవాది ద్వారా బుధవారం నోటీసులు అందజేశారు. మృతుల కుటుంబీకులు కోర్టుకు హాజరై తమకు జరిగిన అన్యాయాన్ని గురించి నిర్వహించుకోవచ్చని నోటీసులో సూచించారు. అదేవిధంగా మృతులలో ఇరువురు మైనర్లు కావడం, తదితర కారణాల వల్ల పాఠశాల రికార్డుల్లో ఉన్న వివరాలను తీసుకొని న్యాయస్థానం ముందు హాజరుకావాలని మృతులు చదువుకున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నోటీసులు అందజేశారు.

విచారణలో తేలుతాయి:

దిశ ఎన్ కౌంటర్.. బూటకమా… నిజమా.. నిందితులు తప్పు చేశారా.. లేదా అన్ని విషయాలు విచారణలో తేలుతాయి అని బాధిత కుటుంబాలకు నోటీసులు అందజేయడానికి వచ్చిన న్యాయవాది మీడియాకు వెల్లడించారు. నేరస్తులు అయినా.. కాకున్న జైలు సూపరింటెండెంట్ వారిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది.. కానీ నలుగురు ఎన్ కౌంటర్ కు గురయ్యారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి కృష్ణమూర్తి విచారణ చేపట్టారు. ముగ్గురు న్యాయమూర్తులతో సిట్ కమిషన్ ఏర్పాటయింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో దేశంలోనే మొట్టమొదటి సారిగా ఎన్ కౌంటర్ పై విచారణ జరుగుతుంది. ఈనెల 26న హైకోర్టులో జరిగే విచారణకు బాధిత కుటుంబ సభ్యులు, మృతులు చదువుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు హాజరుకావాలని నోటీసులు అందజేయడం జరిగిందని న్యాయవాది మీడియాకు వెల్లడించారు.

Tags:    

Similar News