దిశ ఎఫెక్ట్.. మీనాక్షి ఎస్టేట్స్‌లో వైద్యాధికారుల సర్వే

దిశ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ పరిధిలోని మీనాక్షి ఎస్టేట్స్‎లో ‘‘అమ్మో డెంగీ’’ అనే శీర్షికతో ఈనెల 7వ తేదీన ‘దిశ’లో ప్రచురితమైన కథనానికి వైద్యశాఖ అధికారులు స్పందించారు. బుధవారం మధ్యాహ్నం డా.నిర్మల ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి డోర్ టు డోర్ సర్వే చేశారు. ఎవరెవరికీ జ్వరాలు వచ్చాయో వివరాలు సేకరించారు. ఇండ్ల సమీపంలో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని, చెత్త లేకుండా చూసుకోవాలని ప్రజలకు వివరించారు. దీంతో డెంగీ సమస్యను పరిష్కరించేందుకు […]

Update: 2021-09-07 06:03 GMT

దిశ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ పరిధిలోని మీనాక్షి ఎస్టేట్స్‎లో ‘‘అమ్మో డెంగీ’’ అనే శీర్షికతో ఈనెల 7వ తేదీన ‘దిశ’లో ప్రచురితమైన కథనానికి వైద్యశాఖ అధికారులు స్పందించారు. బుధవారం మధ్యాహ్నం డా.నిర్మల ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి డోర్ టు డోర్ సర్వే చేశారు. ఎవరెవరికీ జ్వరాలు వచ్చాయో వివరాలు సేకరించారు. ఇండ్ల సమీపంలో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని, చెత్త లేకుండా చూసుకోవాలని ప్రజలకు వివరించారు. దీంతో డెంగీ సమస్యను పరిష్కరించేందుకు సహకరించిన ‘దిశ’కు స్థానికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Tags:    

Similar News