కరోనా ఎఫెక్ట్.. కీసరలో భక్తులకు దర్శనం నిలిపివేత..

దిశ ప్రతినిధి, మేడ్చల్ : మేడ్చల్ జిల్లాలోని కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల దర్శనం, ఆర్జత సేవలను తాత్కలికంగా నిలిపివేశారు. ఆలయంలో పనిచేస్తున్న పలువురు సిబ్బందికి కరోనా సోకడంతోపాటు కీసర గ్రామంలో కరోనా కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మెన్ టి. నాగలింగం, కార్య నిర్వహణాధికారి కె. సుధాకర్ రెడ్డిలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి తోడు దేవస్థాన సత్రములు భక్తులకు ఇవ్వబడవు. ఆలయ పరిసరాలలో […]

Update: 2021-05-08 08:41 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్ : మేడ్చల్ జిల్లాలోని కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల దర్శనం, ఆర్జత సేవలను తాత్కలికంగా నిలిపివేశారు. ఆలయంలో పనిచేస్తున్న పలువురు సిబ్బందికి కరోనా సోకడంతోపాటు కీసర గ్రామంలో కరోనా కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మెన్ టి. నాగలింగం, కార్య నిర్వహణాధికారి కె. సుధాకర్ రెడ్డిలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి తోడు దేవస్థాన సత్రములు భక్తులకు ఇవ్వబడవు. ఆలయ పరిసరాలలో శానిటైజ్ చేయనున్నందున భక్తులు సహకరించాలని వారు కోరారు.

 

Tags:    

Similar News