టీఆర్‌ఎస్‌లో ఆశావాహులకు నిరాశే!

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ జిల్లా, రాష్ట్ర కమిటీలను, సెప్టెంబర్ లోగా పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని అధిష్టానం భావించినప్పటికీ నేటివరకు ప్రకటించలేదు. అసలు కమిటీలను ప్రకటిస్తారా? లేదా? అనేదానిపై సందిగ్ధం నెలకొంది. కమిటీలో చోటు దక్కితే రాబోయే ఎన్నికల్లో తమకు అసెంబ్లీగానీ, నామినేటెడ్ స్థానాలు గానీ వరిస్తాయని భావించిన ఆశావాహులకు నిరాశే ఎదురవుతోంది. టీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలని భావించి సెప్టెంబర్ 2 నుంచి పార్టీ గ్రామ, వార్డు, మండల కమిటీలతో పాటు […]

Update: 2021-11-03 17:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ జిల్లా, రాష్ట్ర కమిటీలను, సెప్టెంబర్ లోగా పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని అధిష్టానం భావించినప్పటికీ నేటివరకు ప్రకటించలేదు. అసలు కమిటీలను ప్రకటిస్తారా? లేదా? అనేదానిపై సందిగ్ధం నెలకొంది. కమిటీలో చోటు దక్కితే రాబోయే ఎన్నికల్లో తమకు అసెంబ్లీగానీ, నామినేటెడ్ స్థానాలు గానీ వరిస్తాయని భావించిన ఆశావాహులకు నిరాశే ఎదురవుతోంది.

టీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలని భావించి సెప్టెంబర్ 2 నుంచి పార్టీ గ్రామ, వార్డు, మండల కమిటీలతో పాటు జిల్లా, రాష్ట్ర కమిటీలను నెల రోజుల్లోనే పూర్తి చేయాలని భావించారు. అందుకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రణాళికలు రూపొందించారు. అయితే పార్టీల్లో అంతర్గత విభేదాలతో పూర్తిస్థాయిలో మండల కమిటీలను పూర్తి స్థాయిలో నియమించలేదు. జిల్లా, రాష్ట్ర కార్యవర్గాలను సైతం ప్రకటించలేదు. ఈ సమయంలోనే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడం, సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడంతో కమిటీలు వాయిదా పడ్డాయి. దీనికి తోడు అక్టోబర్ 1న ఒకటిన హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం, అదేనెల 25న పార్టీ ప్లీనరీ, అధ్యక్షుడి ఎన్నిక సన్నాహకంపై అధిష్టానం దృష్టిసారించింది. ఈ కమిటీలను వాయిదా వేసింది. కానీ కమిటీలు ఎప్పటివరకు ప్రకటించాలనే అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. నవంబర్ 29న వరంగల్ విజయగర్జన సభ ఉండటంతో మళ్లీ నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర కమిటీలను ప్రకటించే అవకాశం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

రాష్ట్రంలో రెండు, మూడు నియోజకవర్గాలను కలిపి తెలంగాణ ప్రభుత్వం జిల్లాలు ఏర్పాటు చేసింది. కానీ 2014 నుంచి నూతనంగా ఏర్పడిన జిల్లాలకు అధిష్టానం అధ్యక్షులను నియమించలేదు. కొన్ని జిల్లాలకు మంత్రులను ఇన్ చార్జులను నియమించగా, మరికొన్ని జిల్లాలకు ఉమ్మడి జిల్లాకు చెందిన అధ్యక్షులే ఇన్ చార్జులుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా అధ్యక్షులను నియమించాలంటే వారి రాజకీయ అనుభవం, గతంలో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ, ఎంపీలు గా గానీ మరే ఇతర పదవులు అధిరోహించిన వారిని గాని నియమించాల్సి ఉంటుంది. అయితే స్థానిక ఎమ్మెల్యేలతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరే అవకాశం ఉంది. అంతేకాదు ఇప్పటికే ఒక్కో జిల్లా నుంచి అధ్యక్ష పదవి కోసం ముగ్గురు నాలుగురు సామాజిక వర్గాలు, కులాల వారీగా పోటీ పడుతున్నారు. అయితే ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో రాబోయే ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

కమిటీలు వేయకపోతేనే మంచిదనే పార్టీ అధిష్టానం భావిస్తు్న్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నవంబర్ 29న వరంగల్ లో విజయగర్జన సభ ఉండటంతో పార్టీ శ్రేణులు విజయవంతం చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ 119 నియోజకవర్గాలకు గాను 104 నియోజకవర్గాల నేతలతో రోజుకు 20 నియోజకవర్గాల చొప్పున సమావేశం నిర్వహించారు. పార్టీకి కార్యకర్తల తరలింపు, బలోపేతంపై నేరుగా అడిగి తెలుసుకున్నారు. అయితే విజయగర్జన సభ కోసం ఈ నెల మొత్తం గడిచిపోతుంది. ఇప్పటికే పార్టీ కమిటీల జాప్యం, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పార్టీ పదవుల భర్తీ ఆలస్యమైంది. ఒక వేళ పార్టీ కమిటీలను వేయాలనుకుంటే డిసెంబర్ లో వేసే అవకాశం ఉంది. ఇంతకు కమిటీలను ప్రకటిస్తోరో లేదోననే దానిపై సందిగ్ధం నెలకొంది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న నేతల్లో అసమ్మతి ఉన్నప్పటికీ బయటకు చెప్పలేక ఇతర పార్టీలోకి వెళ్లలేక లోలోన మధన పడుతున్నారు.

Tags:    

Similar News