వీఆర్వో, వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలి !

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లలోని ఉద్యోగులకు ప్రమోషన్స్ కల్పించి వారి కుటుంబాలలో సంతోషాన్ని నింపుతున్నారు. కానీ వీఆర్ఓ, వీఆర్ఏలకు మాత్రం న్యాయంగా రావాలిసిన పదోన్నతులు నిలిపివేయడంతో తీవ్ర అన్యాయానికి గురి అవుతున్నారని డైరెక్ట్ రిక్రూట్మెంట్​ వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్ ​గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. తాము పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చామని, ప్రమోషన్ ఛానెల్ ఎక్కువగా ఉన్నందున భవిష్యత్ పైన బంగారు కలలతో ఇతర శాఖల్లో […]

Update: 2021-02-04 09:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లలోని ఉద్యోగులకు ప్రమోషన్స్ కల్పించి వారి కుటుంబాలలో సంతోషాన్ని నింపుతున్నారు. కానీ వీఆర్ఓ, వీఆర్ఏలకు మాత్రం న్యాయంగా రావాలిసిన పదోన్నతులు నిలిపివేయడంతో తీవ్ర అన్యాయానికి గురి అవుతున్నారని డైరెక్ట్ రిక్రూట్మెంట్​ వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్ ​గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. తాము పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చామని, ప్రమోషన్ ఛానెల్ ఎక్కువగా ఉన్నందున భవిష్యత్ పైన బంగారు కలలతో ఇతర శాఖల్లో ఉద్యోగాన్ని వదులుకొని రెవెన్యూ శాఖను ఎంచుకున్నట్లు చెప్పారు. 9సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న కొంతమంది మాత్రమే వీఆర్ఏ, వీఆర్ఓలకు పదోన్నతులు కల్పించారు. మిగతా వాళ్లు ఎదురు చూస్తున్నారన్నారు. వీఆర్వోలకు న్యాయంగా రావాలిసిన ప్రమోషన్స్ నిలిపివేయడంతో తీవ్ర అన్యాయానికి గురి అవుతున్నారన్నారు. రెవెన్యూ శాఖలోని సీనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో వీఆర్ఓలకు న్యాయంగా దక్కాల్సిన 40% శాతం పోస్టులను ఇవ్వకుండా జిల్లా కలెక్టర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News