‘కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు నేరుగా నిధులు’

దిశ, మునుగోడు: గ్రామ వికాసం మోడీ లక్ష్యమని అందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు నేరుగా నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ తెలిపారు. కేంద్ర మంత్రి రాష్ట్ర పర్యటనలో భాగంగా శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని లింగోటం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఏర్పాటు చేసిన ముఖాముఖీ కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రి మాట్లాడుతూ… గ్రామాల వికాసం కోసం మోడీ ప్రభుత్వం కృషి […]

Update: 2021-09-03 06:33 GMT

దిశ, మునుగోడు: గ్రామ వికాసం మోడీ లక్ష్యమని అందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు నేరుగా నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ తెలిపారు. కేంద్ర మంత్రి రాష్ట్ర పర్యటనలో భాగంగా శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని లింగోటం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఏర్పాటు చేసిన ముఖాముఖీ కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రి మాట్లాడుతూ… గ్రామాల వికాసం కోసం మోడీ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. 14, 15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను విడుదల చేసిందని తెలిపారు. గడిచిన ఐదు సంవత్సరాలలో ఎస్ లింగోటం గ్రామానికి తొంభై నాలుగు లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ అభివృద్ధి కోసం విడుదల చేసిందని అన్నారు.

అంతకుముందు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించడంలో విఫలమైందని, కావున దయచేసి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించి మంత్రి ఆవాస్ యోజన కింద నిరుపేదలకు ఇళ్లను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర సహాయ మంత్రి తప్పకుండా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద గ్రామానికి ఇండ్లను మంజూరు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తానే పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ గా ఉన్నందున ఇలా నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

అంతేకాకుండా దేశంలోని గ్రామాలలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లను నిర్మించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, ఎంపీపీ తాడూరు వెంకట్ రెడ్డి, జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, ఆర్డీఓ సూరజ్ కుమార్, ఎమ్మార్వో గిరిధర్, ఎంపీడీవో రాకేష్ రావు, గ్రామ సర్పంచ్ ఆకుల సునీత, ఎంపీటీసీ ఉప్పు భద్రయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:    

Similar News