TSWR JC CET 2021 : దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ నేరుగా ప్రవేశం

దిశ, నల్లగొండ: కరోనా తీవ్రత , విద్యార్ధులు భవిష్యత్తు దృష్ట్యా ప్రవేశ పరీక్ష నిర్వహించకుండా ఈ ఒక్క సంవత్సరం ఎస్ఎస్ సీ సిజిపిఎ ఆధారంగా, అభ్యర్థికి అప్లై చేసినప్పుడు ఇచ్చిన కళాశాల ప్రాధాన్యత  క్రమం ఆధారంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో సీట్ కేటాయింపు జరుగుతుందని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల ప్రాంతీయ సమన్వయ అధికారిని హెచ్. అరుణ కుమారి తెలిపారు. టీఎస్ డబ్ల్యూ ఆర్ జేసీసీఈటీ- 2021కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులందరూ 02.06.2021 నుండి […]

Update: 2021-05-31 10:12 GMT

దిశ, నల్లగొండ: కరోనా తీవ్రత , విద్యార్ధులు భవిష్యత్తు దృష్ట్యా ప్రవేశ పరీక్ష నిర్వహించకుండా ఈ ఒక్క సంవత్సరం ఎస్ఎస్ సీ సిజిపిఎ ఆధారంగా, అభ్యర్థికి అప్లై చేసినప్పుడు ఇచ్చిన కళాశాల ప్రాధాన్యత క్రమం ఆధారంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో సీట్ కేటాయింపు జరుగుతుందని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల ప్రాంతీయ సమన్వయ అధికారిని హెచ్. అరుణ కుమారి తెలిపారు. టీఎస్ డబ్ల్యూ ఆర్ జేసీసీఈటీ- 2021కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులందరూ 02.06.2021 నుండి 07.06.2021 మద్యలో www.tswreis.in వెబ్సైట్‌ను సందర్శించి, ఎస్ఎస్ సీలో పొందిన సబ్జెక్టు గ్రేడ్లను మరియు మొత్తం సీజీపీఏ వివరాలను అప్లోడ్ చేయాలని ఆమె సూచించారు.

సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కళాశాలల్లో ప్రవేశం

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న 33 ప్రతిభ కళాశాల (సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్)యందు 2021-2022 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం నందు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కొరకు గత మార్చి నెలలో ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగిందని నల్గొండ జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారిణి అరుణ కుమారి పేర్కొన్నారు. ఈ పరీక్షలో అర్హత పొందిన వాళ్లు సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ రాయాల్సి ఉండగా.. ఇప్పుడున్న కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ ని నిర్వహించడాన్ని రద్దు చేయడం జరిగిందని వివరించారు. కావున అభ్యర్థులందరికీ ఫస్ట్ లెవల్ లో వచ్చినటువంటి మార్కుల ప్రతిభ ఆధారంగా (సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్) కళాశాలలో అడ్మిషన్లను కేటాయించబడుతుందన్నారు. తేదీ 1-6-2021 సాయంత్రం ఐదు గంటల నుండి అడ్మిషన్ల వివరాలు ఈ http://www.tsswreisjc.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా అందుబాటులో ఉంచబడతాయి. కావున అభ్యర్థులందరూ వెబ్సైట్ ద్వారా తమ అడ్మిషన్ వివరాలను తెలుసుకోగలరని ఆమె తెలిపారు. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Tags:    

Similar News