కోహ్లీ ఇండియా తిరిగి రావడంపై దిలీప్ దోషి విమర్శ
దిశ, స్పోర్ట్స్ : విరాట్ కోహ్లీ భార్య అనుష్క తన తొలి సంతానానికి జనవరిలో జన్మనివ్వనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు అనంతరం ఇండియాకు తిరిగి వచ్చేశాడు. కోహ్లీ తన కుటుంబానికి ఇస్తున్న ప్రాధాన్యతను పలువురు క్రికెటర్లు ప్రశంసించారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మాన్ స్టీవ్ స్మిత్.. కోహ్లీ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడని పొగిడాడు. అయితే భారత జట్టు మాజీ క్రికెటర్ దిలీప్ దోషి మాత్రం కోహ్లీ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. సొంత పనుల […]
దిశ, స్పోర్ట్స్ : విరాట్ కోహ్లీ భార్య అనుష్క తన తొలి సంతానానికి జనవరిలో జన్మనివ్వనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు అనంతరం ఇండియాకు తిరిగి వచ్చేశాడు. కోహ్లీ తన కుటుంబానికి ఇస్తున్న ప్రాధాన్యతను పలువురు క్రికెటర్లు ప్రశంసించారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మాన్ స్టీవ్ స్మిత్.. కోహ్లీ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడని పొగిడాడు. అయితే భారత జట్టు మాజీ క్రికెటర్ దిలీప్ దోషి మాత్రం కోహ్లీ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.
సొంత పనుల కంటే దేశ బాధ్యతలు ముఖ్యమని అన్నాడు. మునిగిపోతున్న నావను వదిలేసి కెప్టెన్ ఎప్పుడూ వెళ్లిపోకూడదని విమర్శించాడు. తొలి టెస్టులో భారత జట్టు ఘోరపరాభవం పాలైన తర్వాతైనా కోహ్లీ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందని దోషి అభిప్రాయపడ్డాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సీనియర్ ఆటగాడు ఆటగాళ్లతో ఉండి వారిలో స్పూర్తిని నింపాల్సిన అవసరం ఉందన్నాడు. బీసీసీఐ కూడా ఇలాంటి నిబంధనలను మార్చాల్సిన అవసరం ఉందని దోషి చెప్పాడు. ఆటగాళ్లు సిరీస్‌ల మధ్యలో తమ జట్టును వీడి పోయేందుకు అనుమతించవద్దని దోషి అన్నాడు. కాగా, దిలీప్ దోషి టీమ్ ఇండియా తరఫున 33 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు.