అమెజాన్ పేలో రూ.5కే 24క్యారెట్స్ బంగారం!

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ కు చెందిన అమెజాన్ పే (Amazon pay)లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ‘గోల్డ్‌వాల్ట్’ పేరుతో అమెజాన్ పే తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు కేవలం రూ.5 కే డిజిటల్ రూపంలో బంగారం కొనుగోలు (Gold purchase) చేయవచ్చు. అంటే భౌతికంగా బంగారం చేతికిరాకపోయినా.. మనం వెచ్చించిన సొమ్ముకు సరిపడా బంగారంపై పెట్టుబడి (Investment) పెట్టుకోవచ్చన్న మాట. ఈ విధంగా వీలు దొరికినపుడల్లా చిన్నమొత్తాల్లో బంగారాన్ని […]

Update: 2020-08-21 11:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ కు చెందిన అమెజాన్ పే (Amazon pay)లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ‘గోల్డ్‌వాల్ట్’ పేరుతో అమెజాన్ పే తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు కేవలం రూ.5 కే డిజిటల్ రూపంలో బంగారం కొనుగోలు (Gold purchase) చేయవచ్చు. అంటే భౌతికంగా బంగారం చేతికిరాకపోయినా.. మనం వెచ్చించిన సొమ్ముకు సరిపడా బంగారంపై పెట్టుబడి (Investment) పెట్టుకోవచ్చన్న మాట. ఈ విధంగా వీలు దొరికినపుడల్లా చిన్నమొత్తాల్లో బంగారాన్ని డిజిటల్ (Digital) రూపంలో కొనుగోలు చేస్తూ, అవసరం వచ్చినపుడు దాన్ని ఒకేసారి అమ్ముకోవచ్చు. లేదంటే మనం జమచేసిన మొత్తానికి సరిపడా బంగారాన్ని సొంతం చేసుకోవచ్చు.

ఇలా దీర్ఘ కాలంపాటు చిన్న మొత్తాల్లో బంగారాన్ని డిజిటల్ రూపంలో కొంటూ పోవడంవల్ల ఒకేసారి పెద్ద మొత్తంలో బంగారం జమవుతుంది. భౌతిక రూపంలో(Physical) ఒకేసారి పెద్ద మొత్తంలో బంగారం కొనలేని వారికి ఈ సౌకర్యం చాలా ఉపయోగకరం. కాగా, ఇప్పటికే పేటీఎం (Patym), ఫోన్‌పే (Phone pay), మొబిక్విక్‌ (Mobikwick) లలో డిజిటల్ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేసే సౌకర్యం ఉన్నది. అయితే, అమెజాన్ పే కొత్త ఫీచర్ ద్వారా కొనుగోలు చేసే బంగారం 99.5 శాతం స్వచ్ఛత కలిగి ఉంటుందని, అది 24 క్యారెట్ బంగారం అని అమెజాన్ పే స్పష్టం చేసింది.

Tags:    

Similar News