అంబేద్కర్ కలను సాకారం చేస్తున్న ‘డిక్కీ’
దిశ, వెబ్‌డెస్క్ : దళిత, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండాలని జీవితాన్ని ధారపోసిన బాబా సాహెబ్ అంబేద్కర్ కల సాకారం దిశగా డిక్కీ చేస్తున్న కృషి అభినందనీయమని ఎస్సీ,ఎస్టీ కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్ టూరిజం ప్లాజాలో జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. మహనీయుని ఆశయాల బాటలో డిక్కీ అడుగులు వేయడం సంతోషకరమన్నారు. దళిత, గిరిజనులు ఆర్థికంగా నిలబడే కార్యక్రమాలకు రూపలకల్పన చేయడం వల్ల బడుగుల జీవితాల్లో మార్పులు వస్తున్నాయన్నారు. దేశ వ్యాప్తంగా […]
దిశ, వెబ్‌డెస్క్ : దళిత, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండాలని జీవితాన్ని ధారపోసిన బాబా సాహెబ్ అంబేద్కర్ కల సాకారం దిశగా డిక్కీ చేస్తున్న కృషి అభినందనీయమని ఎస్సీ,ఎస్టీ కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్ టూరిజం ప్లాజాలో జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. మహనీయుని ఆశయాల బాటలో డిక్కీ అడుగులు వేయడం సంతోషకరమన్నారు. దళిత, గిరిజనులు ఆర్థికంగా నిలబడే కార్యక్రమాలకు రూపలకల్పన చేయడం వల్ల బడుగుల జీవితాల్లో మార్పులు వస్తున్నాయన్నారు. దేశ వ్యాప్తంగా దళిత గిరిజనులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు డిక్కీ అందించిన సహకారం గొప్పదని అన్నారు.
దళితుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఎర్రోళ్ల శ్రీనివాస్ చేసిన కృషి అభినందనీయమని డిక్కీ జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ నర్రా రవికుమార్ అన్నారు. దళిత పారిశ్రామికవేత్తలకు తోడ్పాటునందించడంలో 59 జీఓ సాధించి పెట్టడంలో కమీషన్ సభ్యులు, చైర్మన్ ఎంతో శ్రమించారని గుర్తు చేశారు. అనంతరం చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను డిక్కీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. డిక్కీ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కిరణ్ చంటి, మాజీ అధ్యక్షులు కత్తెరపాక రవి, నరేష్ నాయక్, డిక్కీ మహిళా విభాగం నేతలు నర్రా వనజాక్షి, ఎస్.కృష్ణవేణి, లలిత, శ్రీమా ఆర్తి, మున్నా, జనార్దన్, ఆనంద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.