కంగనా, సుశాంత్ వీడియోలకు రూ. 65 లక్షలు?

దిశ, వెబ్‌డెస్క్: మనం నమ్మిన వాళ్లు ఏ విషయం చెప్పినా ఈజీగా నమ్మేస్తాం. అది నిజమా? అబద్ధమా? అని పరిశోధించి తెలుసుకునే అవకాశం ఉన్నా కూడా, విశ్వసనీయ వ్యక్తులు చెప్పారు కదా! అని గుడ్డిగా నమ్మేస్తాం. ఈ మానవ సైకాలజీని అడ్డం పెట్టుకునే ఇప్పుడు సోషల్ ఇన్‌ప్లూయెన్సర్స్, యూట్యూబర్లు పబ్బం గడుపుకుంటున్నారు. ఈ మాట అనడానికి ఈరే కేథర్ అనే ట్విట్టర్ యూజర్ పెట్టిన పోస్ట్‌కు ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రథీ రిప్లయ్ ఇవ్వడమే కారణం. సుశాంత్ […]

Update: 2020-11-01 05:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: మనం నమ్మిన వాళ్లు ఏ విషయం చెప్పినా ఈజీగా నమ్మేస్తాం. అది నిజమా? అబద్ధమా? అని పరిశోధించి తెలుసుకునే అవకాశం ఉన్నా కూడా, విశ్వసనీయ వ్యక్తులు చెప్పారు కదా! అని గుడ్డిగా నమ్మేస్తాం. ఈ మానవ సైకాలజీని అడ్డం పెట్టుకునే ఇప్పుడు సోషల్ ఇన్‌ప్లూయెన్సర్స్, యూట్యూబర్లు పబ్బం గడుపుకుంటున్నారు. ఈ మాట అనడానికి ఈరే కేథర్ అనే ట్విట్టర్ యూజర్ పెట్టిన పోస్ట్‌కు ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రథీ రిప్లయ్ ఇవ్వడమే కారణం. సుశాంత్ ఆత్మహత్యలో అతని ఫ్యామిలీ పాత్ర గురించి, అలాగే కంగనా రనౌత్ గురించి వీడియోలు చేయడానికి రూ. 65 లక్షలకు ప్రముఖ యూట్యూబర్ డీల్ మాట్లాడుకున్నాడని, ఇప్పటికే కంగనా, అర్నబ్ గోస్వామి గురించి వీడియోలు చేయడానికి ఒక్కో వీడియోకు రూ. 30 లక్షలు తీసుకున్నాడని ఈరే కేథర్ ట్వీట్ చేశాడు.

ఈరే కేథర్ తన ట్వీట్‌లో ఎవరి పేరును ప్రస్తావించలేదు. కాకపోతే ఆ ప్రముఖ యూట్యూబర్‌కు 4 మిలియన్ల కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారని హింట్ ఇచ్చాడు. అయితే ఈ ట్వీట్‌కు యూట్యూబర్ ధ్రువ్ రథీ రిప్లయ్ ఇవ్వడంతో ‘గుమ్మడికాయల దొంగ, చంకలు గుద్దుకున్న’ చందంగా మారింది. ‘ఈ ట్వీట్ నా గురించేనా? కంగనా, సుశాంత్‌ల గురించి నేను ఎలాంటి వీడియో చేయడం లేదు, అయినా వీడియోకు రూ. 30 లక్షలు తీసుకుంటే ఈ పాటికి ఎంతో ధనవంతుడిని అయ్యేవాడిని’ అని ధ్రువ్ రథీ రిప్లయ్ ఇచ్చాడు. మరి ఆ యూట్యూబర్ ఎవరు? నిజంగా వీడియోల గురించి డీల్ కుదిరిందా? అనే ఈ ప్రశ్నల గురించి పక్కన పెడితే, యూట్యూబర్స్ చెప్పినవన్నీ నిజాలు కావని, వాళ్లు కూడా స్పాన్సరింగ్ ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడానికి అతీతులు కారనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకుంటే మంచిది. ముఖ్యంగా రాజకీయ, వ్యక్తిగత, వర్తమాన అంశాల గురించి రివ్యూ చేసే యూట్యూబర్స్ కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది.

Tags:    

Similar News