కడక్‌నాథ్ కోళ్లు ఆర్డరిచ్చిన ధోనీ
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయిన వాళ్లందరూ ఇప్పుడు ఎవర్‌గ్రీన్ చికెన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టారు. వీళ్లలో కొందరు జాబ్ కోసం ఎంటర్ అవుతుండగా, మరి కొందరు ఇంట్రెస్ట్‌తో వెళ్తున్నారు. ఇలాంటి వాళ్లలో ఇప్పుడు భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఒకరు. రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో కోళ్ల పెంపకం చేపట్టాలని ధోనీ నిర్ణయించుకున్నారు. అక్కడ కడక్‌నాథ్ కోళ్లను పెంచడానికి ఇప్పటికే 2,000 కోడి పిల్లలకు ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో ఓ […]
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయిన వాళ్లందరూ ఇప్పుడు ఎవర్‌గ్రీన్ చికెన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టారు. వీళ్లలో కొందరు జాబ్ కోసం ఎంటర్ అవుతుండగా, మరి కొందరు ఇంట్రెస్ట్‌తో వెళ్తున్నారు. ఇలాంటి వాళ్లలో ఇప్పుడు భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఒకరు. రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో కోళ్ల పెంపకం చేపట్టాలని ధోనీ నిర్ణయించుకున్నారు. అక్కడ కడక్‌నాథ్ కోళ్లను పెంచడానికి ఇప్పటికే 2,000 కోడి పిల్లలకు ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్‌లో ఓ ప్రముఖ హాచేరీ నుంచి ఈ కడక్‌నాథ్ కోడిపిల్లలను ధోనీ ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. వీటి మాంసం ఆరోగ్యానికి ఎంతో మంచివి కాబట్టి వాటి పెంపకాన్ని ధోనీ ఎంచుకున్నట్లు తెలిసినవాళ్లు చెబుతున్నారు. డిసెంబర్ 15లోగా ఈ కోడిపిల్లలు రాంచీ చేరుకుంటాయని, ఇప్పటికే ధోనీ డబ్బులు కూడా పంపించారని హాచేరీ యజమాని చెప్పారు. దేశంలోనే ఉత్తమ క్రికెటర్‌కు తన ఫారమ్ నుంచి కోడి పిల్లలను పంపుతుండటం గర్వంగా ఉందని తెలిపారు.