రాంచీకి ధోని తిరుగు ప్రయాణం
మహేంద్ర సింగ్ ధోని అనే పేరు వినగానే క్రికెట్ అభిమానుల గుండెల్లో ఏందో తెలియని ఉత్సాహం నెలకొంటుంది. 2019 ప్రపంచ కప్ అనంతరం ఆయన క్రికెట్ నుంచి కొంత విరామం తీసుకుని దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో అందరూ ధోని పని అయిపోయింది.. అంటూ కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన రూమర్లకు చెక్ పెట్టే విధంగా ప్రాక్టీస్ నిమిత్తం క్రీడా మైదానంలో అడుగుపెట్టాడు. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. రానున్న ఐపీఎల్ కోసం ఆయన […]
మహేంద్ర సింగ్ ధోని అనే పేరు వినగానే క్రికెట్ అభిమానుల గుండెల్లో ఏందో తెలియని ఉత్సాహం నెలకొంటుంది. 2019 ప్రపంచ కప్ అనంతరం ఆయన క్రికెట్ నుంచి కొంత విరామం తీసుకుని దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో అందరూ ధోని పని అయిపోయింది.. అంటూ కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన రూమర్లకు చెక్ పెట్టే విధంగా ప్రాక్టీస్ నిమిత్తం క్రీడా మైదానంలో అడుగుపెట్టాడు. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. రానున్న ఐపీఎల్ కోసం ఆయన సాధన మొదలు పెట్టారు. ధోని ప్రాక్టీస్ చూడటానికి కూడా అభిమానులు ఎంతో ఉత్సాహంగా మైదానంలోకి వెళ్లి మరీ చూశారు. దీంతో ధోని కోసం క్రీడాభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధం అవుతుంది. అయితే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో దాదాపు అన్ని రకాల క్రీడలు రద్దు అయ్యాయి. అందులో భాగంగానే ఐపీఎల్ కూడా వాయిదా పడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఐపీఎల్ కోసం ఎదురుచూసిన క్రీడాభిమానులతో, క్రీడాకారులూ నిరాశ చెందారు. ఈ నెల 29న ప్రారంభంకావాల్సిన ఐపీఎల్.. ఏప్రిల్ 15 వరకు వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ భారత్‌లో వేగంగా వ్యాపిస్తుండడంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు విద్యాసంస్థలు, క్రీడలు, ర్యాలీలు సహా అన్ని రద్దయ్యాయి. ఇప్పటికే భారత్ లో 100కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కథముగిసి.. ప్రస్తుతం వాయిదా పడటంతో చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్న ధోనీ రాంచీకి తిరుగు ప్రయాణమయ్యాడు. ఆయనతో పాటు సహా రైనా, రాయుడు, మురళి విజయ్ మరికొందరు ఆటగాళ్లు తమ తమ ఇంటికి వెళ్లారు. చివరి రోజు ప్రాక్టీస్ సెషన్‌లో ధోనీ అభిమానులు భారీగా స్టేడియానికి చేరుకున్నారు. దీంతో ధోనీ వారందికి సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
Tags : Dhoni, leaves chennai, Ranchi, ipl, practies match, raina, murali vijay