కచ్చితంగా చివరి మ్యాచ్ కాదు : ధోనీ
అబుదాబి: అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కానీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మాత్రం ఇంకా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌లో ధోనీ నాయకత్వం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘోరంగా విఫలమైంది. ఫ్లే ఆఫ్‌కు చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై ఫ్లే ఆఫ్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి. దీంతో బ్యాటింగ్‌లో విఫలమైన ఎంఎస్ ధోనిపై విమర్శలు చెలరేగాయి. […]
అబుదాబి: అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కానీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మాత్రం ఇంకా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌లో ధోనీ నాయకత్వం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘోరంగా విఫలమైంది. ఫ్లే ఆఫ్‌కు చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై ఫ్లే ఆఫ్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి. దీంతో బ్యాటింగ్‌లో విఫలమైన ఎంఎస్ ధోనిపై విమర్శలు చెలరేగాయి. ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అనే ఊహాగానాలకు తెరలేపాయి.
తాజాగా వీటికి ఎంఎస్ ధోని చెక్ పెట్టాడు. ఆదివారం పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా టాస్ సమయంలో వ్యాఖ్యాత, న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ డానీ మోరిసన్ ‘చెన్నై జర్సీలో ఇదే ఆఖరి మ్యాచ్’ అని ఎంఎస్ ధోనిని అడిగాడు. కచ్చితంగా కాదు అని ఒకే ఒక పదంలో మిస్టర్ కూల్ సమాధానం ఇచ్చాడు. ఎంఎస్ ధోని స్పష్టతతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్- 2021లో కూడా చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంఎస్ ధోనినే కెప్టెన్ అని ఇప్పటికే ఫ్రాంచైజీ సీఈఓ విశ్వనాథన్ స్పష్టత ఇచ్చారు.