అరుదైన ఘనత సొంతం చేసుకున్న గబ్బర్

దిశ, స్పోర్ట్స్: పూణేలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్ ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తిరిగి ఫామ్ అందుకున్నాడు. ధావన్ (98) తృటిలో సెంచరీ కోల్పోయాడు. అయితే ఈ మ్యాచ్‌లో ధావన్ ఆసియాలో 5వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన 5వ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. ధావన్ కంటే ముందు సౌరవ్ గంగూలీ (10589), యువరాజ్ సింగ్ (7954), గౌతమ్ గంభీర్ (7327), సురేష్ రైనా (5027) ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. తొలి వన్డేలో […]

Update: 2021-03-23 09:40 GMT

దిశ, స్పోర్ట్స్: పూణేలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్ ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తిరిగి ఫామ్ అందుకున్నాడు. ధావన్ (98) తృటిలో సెంచరీ కోల్పోయాడు. అయితే ఈ మ్యాచ్‌లో ధావన్ ఆసియాలో 5వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన 5వ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. ధావన్ కంటే ముందు సౌరవ్ గంగూలీ (10589), యువరాజ్ సింగ్ (7954), గౌతమ్ గంభీర్ (7327), సురేష్ రైనా (5027) ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. తొలి వన్డేలో ధావన్ నెమ్మదిగా ఇన్నింగ్స్ మొదలు పెట్టి తర్వాత గేర్ మార్చాడు. వేగంగా పరుగులు సాధిస్తూ సెంచరీ వైపు దూసుకొని పోయాడు. అయితే 98 పరుగుల వద్ద బెన్‌స్టోక్స్ బౌలింగ్‌లో ఇయాన్ మోర్గాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ధావన్ 90+ వద్ద అవుటవడం ఇది 5వ సారి కావడం గమనార్హం. సచిన్ 17 సార్లు 90ల మీద అవుటయ్యాడు.

Tags:    

Similar News