ఆ ఎమ్మెల్యే అనుచరుడుని అరెస్ట్ చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
దిశ, గద్వాల: నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు, యువజన నాయకుని ఆగడాలు మితిమీరి పోతున్నాయని.. అమాయకులపై దాడులు చేస్తూ ఇసుక, మట్టిని అక్రమంగా తరలిస్తూ వ్యాపారం చేస్తున్న పెద్దపల్లి అజయ్ పై చర్యలు తీసుకోవాలని.. అతని పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ సోమవారం మాదాసి కురువ, అఖిలపక్ష నేతలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పోలీస్‌లకు, ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వివరాలకు వెళితే ఈ నెల 24 వ తేదీ సద్దలోనిపల్లి […]
దిశ, గద్వాల: నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు, యువజన నాయకుని ఆగడాలు మితిమీరి పోతున్నాయని.. అమాయకులపై దాడులు చేస్తూ ఇసుక, మట్టిని అక్రమంగా తరలిస్తూ వ్యాపారం చేస్తున్న పెద్దపల్లి అజయ్ పై చర్యలు తీసుకోవాలని.. అతని పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ సోమవారం మాదాసి కురువ, అఖిలపక్ష నేతలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పోలీస్‌లకు, ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వివరాలకు వెళితే ఈ నెల 24 వ తేదీ సద్దలోనిపల్లి గ్రామానికి చెందిన లవన్న పై అజయ్ అనుచరులు దాడి చేయడం జరిగింది. దీనికి కారణం మల్లకల్ జాతర సందర్భంగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి పేరిట ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. అయితే వాటిని అజయ్ అనుచరులు చించి వేశారని ఆ విషయం పై లవన్న నిలదీస్తే అజయ్ తన అనుచరులతో త్రీవంగా దాడి చేసి గాయపరిచారని నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్ తెలిపారు.
పోలీస్ స్టేషన్‌లో కేసు పెడితే కనీసం బాధితుడికి న్యాయం చేయకపోగా అజయ్‌కి పోలీస్ లు వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు. అజయ్ అనే వ్యక్తి మట్టి, ఇసుక అక్రమ వ్యాపారం చేస్తున్నా.. రెవెన్యూ, మైనింగ్ అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారన్నారు. అజయ్ ఎమ్మెల్యే అండతోనే సామాన్యులపై దాడులు చేస్తున్నారన్నారు. అయితే అతనిపై హత్య నేరారోపణలు కూడా ఉన్నాయని వారు ఈ సందర్భంగా తెలిపారు. లవన్న పై దాడి చేసిన అజయ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి అతని పై 307 కేసు నమోదు చేయాలంటూ సుమారు గంట సేపు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమం లో మధు, విజయ్, వెంకట్రాములు, క్రాంతి, రవి, కురువ కులస్తులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.