TRSకు బిగ్ షాక్… సొంత గూటికి కీలక నేత

దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం సీఎం కేసీఆర్ డీఎస్ ను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించి పెద్దల సభకు పంపించారు. అయితే, ఆయన ఆరోగ్యం అనుకూలించకపోవడంతో ఇటు రాజ్యసభ సమావేశాలకు, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన కొడుకు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ డీఎస్ ను బీజేపీలోకి ఆహ్వానిస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ ఆయన […]

Update: 2021-12-16 07:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం సీఎం కేసీఆర్ డీఎస్ ను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించి పెద్దల సభకు పంపించారు. అయితే, ఆయన ఆరోగ్యం అనుకూలించకపోవడంతో ఇటు రాజ్యసభ సమావేశాలకు, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన కొడుకు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ డీఎస్ ను బీజేపీలోకి ఆహ్వానిస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపలేదు. డీఎస్ ఎంపీ పదవీకాలం కూడా త్వరలో ముగియనుండటంతో తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీని గురించి కాంగ్రెస్ హైకమాండ్ డీఎస్ తో ఇప్పటికే మంతనాలు జరిపినట్లు సమాచారం. త్వరలో ఆయన TRS పార్టీకి హ్యాండిచ్చి సొంత గూటికి చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

సీఎంకు వారసత్వ సవాల్… కవిత వర్గానికా? కేటీఆర్ వర్గానికా?

Tags:    

Similar News