ఈసారైనా తనను ఇంప్రెస్ చేయాలి: ధనుష్

దిశ, వెబ్‌డెస్క్: హిట్ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. ధనుష్-సెల్వ రాఘవన్-యువన్ శంకర్ రాజా ట్రియో మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. వి క్రియేషన్స్ బ్యానర్‌పై అరవింద్ కృష్ణ నిర్మిస్తున్న సినిమా గురించి సెల్వ రాఘవన్ ట్విట్టర్‌లో అధికారికంగా ప్రకటించగా దీనిపై స్పందించారు ధనుష్. సెల్వ రాఘవన్, యువన్, అరవింద్ కృష్ణతో సినిమా స్పెషల్‌గా ఉంటుందన్నారు. తన మేకర్, క్రియేటర్, తను ఈ స్థాయిలో ఉండేందుకు ఒకే ఒక్క కారణమైన తన అన్న సెల్వ రాఘవన్‌తో మళ్లీ […]

Update: 2020-12-24 01:58 GMT
ఈసారైనా తనను ఇంప్రెస్ చేయాలి: ధనుష్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: హిట్ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. ధనుష్-సెల్వ రాఘవన్-యువన్ శంకర్ రాజా ట్రియో మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. వి క్రియేషన్స్ బ్యానర్‌పై అరవింద్ కృష్ణ నిర్మిస్తున్న సినిమా గురించి సెల్వ రాఘవన్ ట్విట్టర్‌లో అధికారికంగా ప్రకటించగా దీనిపై స్పందించారు ధనుష్.

సెల్వ రాఘవన్, యువన్, అరవింద్ కృష్ణతో సినిమా స్పెషల్‌గా ఉంటుందన్నారు. తన మేకర్, క్రియేటర్, తను ఈ స్థాయిలో ఉండేందుకు ఒకే ఒక్క కారణమైన తన అన్న సెల్వ రాఘవన్‌తో మళ్లీ సినిమా చేస్తుండటం సంతోషంగా ఉందని చెప్పారు. కనీసం ఈ సారైనా తనను ఇంప్రెస్ చేస్తానని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ చిత్రం యువన్ శంకర్ రాజా, సెల్వ రాఘవన్ కాంబినేషన్‌లో వస్తున్న ఎనిమిదో సినిమా కావడం విశేషం.

Tags:    

Similar News

Sai Pallavi