స్థానిక ఎమ్మెల్సీకి నామినేషన్ దాఖలు చేసిన దండే విఠల్
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దండే విఠల్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ముఖ్య నాయకులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దండే విఠల్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దండే విఠల్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ముఖ్య నాయకులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దండే విఠల్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడి నుంచి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. దండే విఠల్ కు మద్ధతుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న మొదటి సెట్ నామినేషన్ దాఖలు ప్రక్రియలో పాల్గొన్నారు. మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నారు.
దండే విఠల్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు:
శాస్త్రినగర్ లోని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాసంలో స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దండే విఠల్ కు ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా శ్యాం నాయక్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు వేణు గోపాలచారి, ఇతర ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు