సీపీఐ రామకృష్ణపై దేవులపల్లి అమర్ ఫైర్..

దిశ, వెబ్‌డెస్క్: అంతరాష్ట్ర, జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శిపై మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్దిరోజులుగా ఆయన తనపై చేస్తున్న విమర్శలను ఖండించారు. ప్రభుత్వ సలహాదారులు ఏ విధంగా సలహాలు, సూచనలు ఇవ్వాలో తనకు తెలుసునని, రామకృష్ణ నుంచి తెలుసుకోవాల్సిన అవసరం లేదని హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆంధ్రప్రదేశ్‌ సలహాదారుల మీద చేసిన […]

Update: 2020-08-25 11:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: అంతరాష్ట్ర, జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శిపై మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్దిరోజులుగా ఆయన తనపై చేస్తున్న విమర్శలను ఖండించారు. ప్రభుత్వ సలహాదారులు ఏ విధంగా సలహాలు, సూచనలు ఇవ్వాలో తనకు తెలుసునని, రామకృష్ణ నుంచి తెలుసుకోవాల్సిన అవసరం లేదని హితవు పలికారు.

ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆంధ్రప్రదేశ్‌ సలహాదారుల మీద చేసిన వ్యాఖ్యలు చదివాను. సలహాదారులు ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు పత్రికా ప్రకటన ద్వారానో, వీధి ప్రదర్శనల ద్వారానో ప్రకటించేలా ఉండవు. అధికారంలో భాగస్వామ్యం కోసమో, చట్ట సభల్లో సొంత శక్తితో వెళ్లలేక అధికార పక్షాల మొప్పు కోసమో, లేదా ఇతర ప్రయోజనాల కోసం చేసే ప్రదర్శనలు కావని మండిపడ్డారు.

ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు ప్రజలకు మంచి చేసేలా ఉండాలని, అవి కూడా ప్రభుత్వానికి అవసరమైన రీతిలో, తగిన సమయంలో ఇచ్చేలా ఉంటాయన్నారు. ఈ విషయాలు రామకృష్ణ లాంటి వ్యక్తులకు చెప్పాల్సిన అవసరం లేదు. సీపీఐ పార్టీని కొంతైనా మెరుగుపరిచేందుకు ఎవరైనా మంచి సలహాదారుడిని వెతుక్కోవాలని నా సూచన’ అని లేఖ ద్వారా వెల్లడించారు.

Tags:    

Similar News