ఈ గుడి లోపలికి వెళ్లాలంటే కళ్లకు గంతలు కట్టుకోవాల్సిందే
భారత దేశం ఎన్నో చారిత్రాత్మక దేవాలయాలకు నెలవు.
దిశ, ఫిచర్స్ : భారత దేశం ఎన్నో చారిత్రాత్మక దేవాలయాలకు నెలవు. ఒక్కో ఆలయం ఒక్కో చరిత్రను, ఒక్కో ఆచారాన్ని, ఒక్కో సాంప్రదాయాన్ని కలిగి ఉంది. మరికొన్ని ఆలయాల్లో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి ఒక ఆలయం గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం..
ఉత్తరాఖాండ్‌లోని చమోలి జిల్లాలోని దేవల్ బ్లాక్ అడవిలో లాతూ మందిరంలో వింత ఆచారాలను పాటిస్తారు. అలాగే అంతుచిక్కని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రవేశించే ముందు భక్తులు కళ్లకు గంతలు కట్టుకుంటే పూజారి నోటికి, కళ్లకు గంతలు కట్టుకోవాలంట. ఆ తరువాతే ఆలయంలోకి ప్రవేశించి దేవతని దర్శనం చేసుకోవాలంట. ఉత్తరాఖాండ్‌లోని నందాదేవి మతపరమైన సోదరిగా లాతు దేవతను పరిగణిస్తారని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంత ప్రజలు ఈ దేవతను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
కళ్లకు గంతలు ఎందుకు కట్టుకోవాలంటే
నాగరాజు తన విలువైన రత్నాన్ని ధరించి లాతు దేవాలయంలో దర్శనం ఇస్తాడట. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు నేరుగా ప్రకాశిస్తున్న మణిని చూస్తే గుడ్డివారు అవుతారని అక్కడి పండితులు చెబుతున్నారు. అందుకే కళ్లకు గంతలు కట్టే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఈ ఆలయం ఏడాది పొడవునా తెరవకుండా కేవలం వైశాఖ పౌర్ణమి రోజు మాత్రమే తెరుస్తారట. ఆలయాన్ని తెరిచిన రోజు భక్తులు ఆలయ ప్రవేశం చేసి దూరం నుంచే దైవదర్శం చేసుకుంటారు.