Tirumala Updates: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. దర్శనానికి 9 గంటల సమయం

కలియుగ దైవం వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

Update: 2024-11-07 02:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం స్వామి వారిని దర్శించుకునేందుకు మోస్తరుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 9 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) 2 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని 17 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. బుధవారం స్వామి వారిని 66,163 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 25,229 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.86 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) తెలిపారు. 

Tags:    

Similar News