Tirumala Samacharam: కిక్కిరిసిన తిరుమల క్షేత్రం.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

కార్తీక మాసం ప్రారంభం కావడంలో వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.

Update: 2024-11-03 03:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: కార్తీక మాసం ప్రారంభం కావడంలో వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శనివారం స్వామి వారిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 20 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది.

అదేవిధంగా ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో కిక్కిరిపోయాయి. శిలతోరణం వరకు (Shila Thoranam) వరకు భక్తుల క్యూ లైన్ కొనసాగుతోంది. శనివారం స్వామి వారిని 88,076 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.52 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు (TTD Offcials) వెల్లడించారు.

Tags:    

Similar News