Today Horoscope: ఈరోజు రాశి ఫలాలు(13-04-2025)

భాగస్వామి మాట వినడం వల్ల సమస్య నుంచి బయటపడుతారు.

Update: 2025-04-12 22:00 GMT
Today Horoscope: ఈరోజు రాశి ఫలాలు(13-04-2025)
  • whatsapp icon

మేష రాశి:

భాగస్వామి మాట వినడం వల్ల సమస్య నుంచి బయటపడుతారు. అజాగ్రత్త వల్ల విలువైన వస్తువులు కోల్పోతారు. ఆరోగ్యం పట్ల కేర్ తీసుకోవడం తప్పనిసరి. మంచి రాబడి వస్తుంది. మీ పనిలో మార్పు కనిపిస్తుంది. ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులు స్వయం ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రశాంతత కోసం పార్కుకు వెళ్తారు.

వృషభ రాశి:

అనవసరపు ఖర్చులు అధికమవుతాయి. ఇంటికి ఇతరులు రాక ఇబ్బందుల్ని కలిగిస్తుంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. కానీ మీ జీవిత భాగస్వామి మీ పట్ల కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. రోజంతా తీరిక లేనంత బిజీగా గడుపుతారు. గృహ నిర్మాణాలు ప్రారంభానికి మంచి రోజు.

మిథున రాశి:

దూర ప్రయాణాలతో చికాకు వస్తుంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. రాజకీయ నాయకులు సభా సమావేశాల్లో పాల్గొంటారు. మీ మాటలు మీ ఫ్రెండ్స్‌ను గాయపరుస్తాయి. మీ భాగస్వామి మీ ఆలోచనలను గౌరవిస్తాడు. నేడు సెమినార్లు, ఉపన్యాసాలు ఇస్తారు. కష్టపడి పని చేస్తారు.

కర్కాటక రాశి:

ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కాస్త సమయం రెస్ట్ తీసుకోవాలి. అనవసరపు ఖర్చులు చేయొద్దు. మీరు గతంలో చేసిన తప్పును నేడు గుర్తు చేసుకుని బాధపడుతారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి వెనకడుగు వేస్తారు. కాగా పెద్దల సలహాలు తీసుకోవడం మేలు. కొన్ని విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంటాయి. మీ భాగస్వామికి అర్జెంట్ పని ఉండటం వల్ల మీరు ఇవాళ వేసుకున్న ప్లాన్ క్యాన్సిల్ అవుతుంది.

సింహ రాశి:

ప్రైవేటు ఫైనాన్స్ లో పొదుపు చేయడం మంచిది కాదు. నేడు పనులు నెమ్మదిగా జరుగుతాయి. నిద్రపోతున్నప్పుడు పలు సమస్యలు గుర్తొచ్చి.. ఒత్తిడికి గురవుతుంటారు. నేడు కోపతాపాలతో గడుస్తుంది. ఉద్యోగం విషయంలో అంతా బాగానే ఉంటుంది. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతారు. విద్యార్థులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కన్యా రాశి:

ప్రయాణాల్లో మెళకువ అవసరం. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ ఓర్పును కోల్పోవద్దు. మీ ఫ్రెండ్స్ సలహాలు తీసుకుంటారు.అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచుకోండి. అలాగే మిత్రుల సలహా పాటిస్తే మీకు బాగా కలిసి వస్తుంది. ఆఫీసులో ప్రతిరోజూ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు.

తులా రాశి:

ట్రిప్ ప్లాన్స్ వాయిదా పడుతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. దగ్గరి రిలేషన్స్ కారణంగా మీ వ్యాపారంలో లాభం చేకూరుతుంది. గ్రూపు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధాలు వస్తాయి. మీ నిర్ణయాలకు పెద్దలు గౌరవిస్తారు. ఇవాళ ఏ పని అయినా ఉత్సాహంగా చేస్తుంటారు. ఇంటికి ఎక్కువగా రిలేషన్స్ వస్తుంటారు.

వృశ్చిక రాశి:

ఇంటి వాతావరణం చికాకు పుట్టిస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత్త వహించడం ముఖ్యం. ఏ విషయం పట్ల కూడా శ్రద్ధ పెట్టరు. ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. పెళ్లైన వారు.. అలాగే సంతానం, స్టడీ కోసం మనీ వెచ్చించవల్సి ఉంటుంది. పిల్లలు చెప్పే కొన్ని విషయాలు మిమ్మల్ని ఆందోళనలోకి నెట్టేస్తాయి. నేడు సమయానికి ఆఫీసుకెళ్లి.. టైమ్ కు ఇంటికి చేరుకోవడం మేలు. ఇంటికెళ్లాక ఫ్యామిలీతో కలిసి మూవీ చూస్తారు. కానీ భాగస్వామితో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి.

ధనుస్సు రాశి:

సాయంత్రం వేళ కాస్త ఆందోళనకు గురవుతుంటారు. తోబుట్టువులు మీకు హెల్స్ చేస్తారు. వారి వల్లే ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. నేడు మీ దగ్గరి వాళ్లను అన్ని విషయాలు పంచుకునే అవకాశం ఉంది. ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరిస్తారు. భాగస్వామితో ఏదైనా సీక్రెట్ పంచుకోవాలంటే.. ఒకటి రెండు సార్లు ఆలోచించడం మేలు. కొత్తగా ఆలోచిస్తారు. కానీ ఒత్తిడికి గురవుతారు. మీ లైఫ్ లో అత్యుత్తమ సాయంత్రాన్ని ఇవాళ మీ భాగస్వామితో గడుపుతారు.

మకర రాశి:

కోళ్లు, మత్స్య వ్యాపారులకు లాభం చేకూరుతుంది. ప్రముఖులతో కలిసి పలు కార్యక్రమాల్లో, సమావేశాల్లో పాల్గొంటారు. ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించడం మేలు. అలాగే ఇతరులను ఈజీగా నమ్మితే కొత్త సమస్యలు తెచ్చిపెట్టుకున్నవారు అవుతారు. ఆర్థికపరంగా లాభాలు చేకూరుతాయి. స్త్రీలకు నేడు అలంకారణపై మక్కువ పెరుగుతుంది.

కుంభ రాశి:

ఫ్యామిలీలో వ్యతిరేకతలు ఎదురవుతాయి. వ్యాయామాలు చేయడం మంచిది. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది. అధికారికంగా పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మేలు. ఫ్రెండ్స్ తో సంతోషంగా గడుపుతారు.

మీన రాశి:

కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు నేడు ఆర్థిక పరంగా మంచి జరుగుతుంది. వ్యాపారంలో దూసుకుపోతారు. నేడు ఎక్కువగా పాటలు వింటారు. ఇవాళ ఎవరికీ చెల్లి గవ్వ కూడా ఇవ్వకండి. మహిళలు షాపింగ్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. మీ వ్యాపార విషయాలు ఇతరులకు చెప్పకపోవడం మేలు. పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు.

Tags:    

Similar News