ఆలయం నుంచి ఇంటికి వస్తూ ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదట.. అవి ఏంటో తెలుసా..

హిందూ మతంలో భగవంతుని ఆరాధన అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు.

Update: 2024-02-08 15:24 GMT

దిశ, ఫీచర్స్ : హిందూ మతంలో భగవంతుని ఆరాధన అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అయితే దేవుడిని పూజించడంలో పొరపాటున కూడా తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. అలా చేయడం వలన దేవుడు ఆగ్రహిస్తాడని, మనిషి జీవితంలో సమస్యలు తలెత్తుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే ఆలయంలో దేవుడి దర్శనం తరువాత గుడి నుండి వచ్చేటపుడు కొన్ని పొరపాట్లు చేయకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి ఆ పొరపాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దారిలో ప్రసాదం తినకూడదా ?

గుడి నుంచి తీసుకువచ్చే ప్రసాదం మార్గమద్యంలో అస్సలు తినకూడదని పండితులు చెబుతున్నారు. అలాగే గుడి నుండి తిరుగు ప్రయాణంలో ఎప్పుడూ భోజనం చేయకూడదట. ఇలా చేస్తే మీ ఆరాధన అసంపూర్ణం అవుతుందని పండితులు చెబుతున్నారు. ఆలయంలో స్వీకరించిన ప్రసాదాన్ని ఇంట్లో ప్రసాదంతో కలిపి కుటుంబ సభ్యులందరికీ పంచి, కలిసి సేవించాలట.

ఎవరైనా ఖాళీ కుండను ఇంటికి తీసుకురాకూడదా ?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గుడికి వెళ్లేటప్పుడు లేదా వచ్చే సమయంలో ఖాళీ కుండను ఇంటికి తీసుకురాకూడదు. ఇంట్లో ఖాళీ కుండ తీసుకురావడం వల్ల మనిషి జీవితంలో చేసే పని కూడా జరగకుండా ఆగిపోతుందని నమ్ముతారు. అందుకే దేవుడికి నీళ్ళు నైవేద్యంగా పెట్టేటప్పుడు కుండలో కొంచెం నీరు వదలాలి. లేదా నీరు అందుబాటులో లేనట్లయితే, మీరు గుడి నుండి వచ్చిన పూజ పుష్పాలను అయినా కుండలో ఉంచవచ్చు. గుడి నుంచి నిండు కుండను తీసుకురావడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, శ్రేయస్సు కలుగుతుందని చెబుతారు.

గుడిలో పూజ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకూడదా ?

గుడిలో పూజలు చేసే సమయంలో వెలిగించే దీపం నుంచి మరో దీపం వెలిగించకూడదని పండితులు అంటున్నారు. ఇది దేవుడికి కోపం తెప్పిస్తుందని నమ్ముతారు. పూజ సమయంలో దేవునికి ఏ పూజా సామాగ్రిని సమర్పించినా, నేలపై పడిన ఏ వస్తువునైనా తిరిగి దేవుడికి సమర్పించకూడదు. అలా చేస్తే భగవంతుడిని అగౌరవ పరిచినట్టే అని నమ్ముతారు. అలాగే, పూజ చేసేటప్పుడు, పూజా స్థలంలో ఒకరి చేతిలో ఉన్న పూజ సామగ్రిని తీసుకోవద్దు. ఇలా చేయడం వల్ల దేవునికి అసంతృప్తి, పూజకు ఆటంకం కలుగుతుందట.

Tags:    

Similar News