మోదెరా సూర్యదేవాలయంలో వీడని మిస్టరీ లెన్నో..

ప్రత్యక్ష దైవం సూర్యభగవానునికి మనదేశంలో అతితక్కువ ఆలయాలు మాత్రమే నెలకొన్నాయి. అవి కోణార్క్ సూర్యదేవాలయం, అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం.

Update: 2024-01-03 08:33 GMT

దిశ, ఫీచర్స్ : ప్రత్యక్ష దైవం సూర్యభగవానునికి మనదేశంలో అతితక్కువ ఆలయాలు మాత్రమే నెలకొన్నాయి. అవి కోణార్క్ సూర్యదేవాలయం, అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం. వీటితో పాటు గుజరాత్ రాష్ట్రంలోని మోదెరాలో కూడా సూర్యదేవునికి ఓ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు, అద్భుతాలు దాగి ఉన్నాయి. ఈ ఆలయాన్ని క్రీ.శ.1026 లో సూర్యవంశానికి చెందిన సోలంకి కుటుంబ సభ్యులు భీముడు నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ఆలయాన్ని గురించి బ్రహ్మ పురాణంలో వివరించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలోని గుర్భగుడిలో జూన్ 21వ తేదీన సూర్యుని తొలి కిరణం స్వామి వారి కిరీటం పై రత్నం మీద పడుతుంది. దీంతో ఆలయం గర్భగుడి మొత్తం ప్రకాశిస్తుంది.

మోదెరాలో సూర్యుని ఆలయంతో పాటు 108 ఆలయాలను నిర్మించారు. వాటితో పాటుగా ఆలయంలో వేడిగా ఉండే గదులు, 52 స్తంభాలతో నృత్య మండపాన్ని నిర్మించారు. ఈ మండపం ఏడాదిలోని 52 వారాలను సూచిస్తాయి. నృత్య మండపంలో ఉండే స్తంభాల పై మహాభారత కాలానికి చెందిన కళాఖండాలు, సీతారామ వణవాసానికి చెందిన చిత్రాలు రాతి పై అద్భుతంగా చెక్కబడ్డాయి. 364 ఏనుగులు, ఒక సింహం శిల్పాలను ఆలయం వెలుపల ఉన్న గోడల చెక్కారు. గోడలపై చెక్కిన ఏనుగులు, సింహం సంవత్సరంలోని రోజులను తెలియజేస్తాయి.

ఈ ఆలయంలో ఆగ్నేయ దిశలో అగ్నిదేవుడి విగ్రహాన్ని, దక్షిణ దిశలో యమధర్మరాజు విగ్రహం, నైరుతి దిశలో నైరుత్ర స్వామి విగ్రహాలను ప్రతిష్టించారు. అలాగే సరస్వతి దేవి విగ్రహాన్ని ఆలయం పై భాగంలో ప్రతిష్టించారు. పశ్చిమ దిశలో వరుణుని విగ్రహం, వాయువ్య దిశలో వాయువ్వని విగ్రహం, ఉత్తర దిశలో కుభేరుని విగ్రహం, ఈశాన్యంలో శివుని విగ్రహం ప్రతిష్టించారు. ఆలయం మొదటి భాగంలో ఉన్న సూర్య కుండలో నీరు ఎప్పటికీ ఎండిపోదు.

Tags:    

Similar News