Lord Ganesh: గణపతి విగ్రహం కలలో కనిపిస్తే మంచి జరుగుతుందా.. జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

గణపతి విగ్రహం కలలో కనిపిస్తే మంచి జరుగుతుందా

Update: 2024-09-07 02:58 GMT

దిశ, వెబ్ డెస్క్: హిందువుల పండుగలలో వినాయక చవితిని బాగా జరుపుకుంటారు. అంతే కాకుండా ఈ పండుగకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం గణపతి పుట్టిన రోజును వినాయక చవితిగా భద్ర మాసం శుక్ల చతుర్థి తిథి రోజున అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే, ఈ సంవత్సరం సెప్టెంబర్ 7 వ జరుపుకోనున్నారు. అంటే ఈ రోజున గణేశుడు భూ లోకానికి వస్తాడని భక్తుల విశ్వాసం. విగ్రహం పెట్టిన రోజున నుంచి ఉదయం, సాయంత్రం పూజలు అందుకుని భక్తుల కోరికలు నేరవేరుస్తాడు. స్వప్న శాస్త్రం ప్రకారం గణపతి దేవుడు కలలో కనిపిస్తే ఇంట్లో మంచి జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దాని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

కలలో వినాయకుడి విగ్రహం

కలలో వినాయకుడి విగ్రహం కనిపించనట్లయితే ఆ రోజు నుంచి వారికీ అంతా శుభమే. అలాగే మీ సంపద కూడా రెట్టింపు అవుతుంది. అంతే కాకుండా త్వరలోనే పెళ్లి కుదిరే అవకాశం కూడా ఉందని జజ్యోతిష్యులు నిపుణులు చెబుతున్నారు.

బ్రహ్మ ముహర్తంలో గణేశుడు కల కనిపిస్తే

బ్రహ్మ ముహర్తంలో వినాయకుడు కనిపిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది.ముఖ్యంగా, ఆర్ధిక సమస్యల నుంచి బయటపడతారు. అప్పటి వరకు ఉన్న కష్టాలను తీర్చి కరుణతో సంపదను రెట్టింపు చేస్తాడు. వినాయకుని ఆశీస్సులతో ఆకస్మిక ధనం లభిస్తుందట. అంతే కాకుండా, కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికీ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Tags:    

Similar News