తెలుగు సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయి.. దాని వెనుక పురాణా కథ తెలిస్తే షాకవ్వాల్సిందే!

ముఖ్యంగా తెలుగు సంవత్సరాలు 60 ఉంటాయి.

Update: 2024-04-05 13:25 GMT

దిశ, ఫీచర్స్: హిందూ క్యాలెండర్ ప్రకారం, తెలుగు కొత్త సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్ష పాడ్యమి తిథి నాడు ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 9 మంగళవారం పండుగను జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే సంవత్సరాన్ని శ్రీ క్రోధ నామ సంవత్సరం అంటారు. దీని అర్థం ఏదో సమస్యలను కలిగిస్తుంది. ఈ సమయంలో ప్రజలు కోపంగా ప్రవర్తించే అవకాశం ఉందని జ్యోతిష్యులు అంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య కోపం, దేశాలు మరియు రాష్ట్రాల మధ్య విభేదాలు, దేశాల మధ్య విభేదాలు యుద్ధాలు ఎక్కువగా జరుగుతాయని ఉందని నిపుణులు అంటున్నారు. కొంతమంది ఉగాది రోజున కొత్త బట్టలు కట్టుకుని పూజలు చేస్తారు. ఉగాది పచ్చడిని మామిడికాయలు, చింతపండు, ఉప్పు, కారం, బెల్లం,మిరియాలు, వేపపువ్వు లతో తయారు చేస్తారు. తెలుగు సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయి.. దాని వెనుక పురాణా కథ ఏంటో ఇక్కడ చూద్దాం..

ముఖ్యంగా తెలుగు సంవత్సరాలు 60 ఉంటాయి. ఇవి ప్రతి ఏడాది మారుతూ ఉంటాయి. దీనివెనుక కొన్ని పురాణా కథలు ఉన్నాయి. విష్ణుమాయ కారణంగా.. నారదుడికి 60 మంది సంతానం జన్మించారు. ఈ అరవై మంది ఎప్పటికి గుర్తుండిపోయేలా వరం కావాలని విష్ణుభగవానుడిని, నారదుడు వేడుకున్నాడట. దీంతో ఆయన వీరి పేర్లు.. శాశ్వతంగా నిలిచిపోతాయని వరం ఇచ్చారంట. మనం ప్రతిఏడాది మారుతున్న ఈ తెలుగు సంవత్సరాలు పేర్లు, నారదుడి కుమారుల పేర్లు. 


Similar News