దయ్యాలను వదిలించే దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా..
ఏ ఆలయానికి వెళ్లిన దేవుని విగ్రహాలు దర్శనం ఇస్తుంటాయి. కానీ ఓ ఆలయంలో మాత్రం పాదుకల రూపంలో భగవంతుడు దర్శనం ఇస్తాడు.
దిశ, వెబ్‌డెస్క్ : ఏ ఆలయానికి వెళ్లిన దేవుని విగ్రహాలు దర్శనం ఇస్తుంటాయి. కానీ ఓ ఆలయంలో మాత్రం పాదుకల రూపంలో భగవంతుడు దర్శనం ఇస్తాడు. అంతే కాదు ఆ ఆలయంలో చేతబడి తొలగించడం, ఆత్మల్ని బంధించడం, దయ్యాల్ని వదిలించడం వంటివి కూడా చేస్తుంటారట. వింటుంటేనే వింతగా ఉంది కదా ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది. ఆ ఆలయ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కర్నాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలోని గానగాపూర్ లో వెలసిన దత్తాత్రేయుని దేవాలయాన్ని ఆధ్యాత్మిక స్వర్గంగా భావిస్తారు అక్కడి భక్తులు. ఈ ఆలయంలో దత్తత్రేయుడు పాదుకల రూపంలో దర్శనం ఇచ్చి భక్తులను కరుణిస్తాడు. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఆలయాన్ని దర్శించినంతటనే తొలగిపోతాయని విశ్వసిస్తారు. దత్తాత్రేయుని రెండో అవతారమైన నరసింహసరస్వతి స్వామి అని శ్రీ గురు చరితంలో లిఖించారు.
ఆ శ్రీ గురుపాదుకలే ఈ గానుగాపూర్ ఆలయంలో దర్శనం ఇస్తున్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో ప్రతినిత్యం పాదుకలకు అభిషేకం నిర్వహించి పూలు, వస్త్రాలను కప్పుతారట. అలాగే ఈ క్షేత్రంలో వెలసిన కాషాయ వర్ణ గణపతికి వైష్ణవ పద్ధతిలో పూజలు నిర్వహిస్తుంటారు. గణపతితో పాటు ఈ ఆలయంలో మహా బాహుబలి, ఆంజనేయస్వామి విగ్రహాలు కూడా దర్శనం ఇస్తాయి.
ఈ ఆలయంలో ఉండే రెండు ఎత్తైన ఇనుప స్తంబాల పై కొంత మంది భక్తులు ఎక్కి జుట్టు విరబూసుకుని భయంకరంగా రోదిస్తూ ఉంటారట. ఆలయ దర్శనానికి రాకముందు మామూలుగానే ఉన్నా గుడి లోపలికి ప్రవేశించగానే కేకలువేస్తూ ఊగిపోతుంటారట. ఎప్పుడైతే మహాహారతి ధ్వనులు వినిపిస్తాయో అప్పడూ వారందరూ శాంతిస్తారని, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని పురోహితులు చెబుతుంటారు. ఈ ఆలయంలో జాతకదోషాలు కూడా తొలగిస్తారని చెబుతారు.