ఉగాది 2024: జ్యోతిష్యులను కూడా భయపడుతున్న క్రోధి నామసంవత్సరం.. ఎందుకంటే?

జ్యోతిష్యులను కూడా భయపడుతున్న క్రోధి నామసంవత్సరం

Update: 2024-04-05 12:27 GMT

దిశ, ఫీచర్స్: హిందూ సంప్రదాయం ప్రకారం ఉగాది పండుగకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. జ్యోతిష్యులు దీనిని ఉగాది,యుగాది అంటారు. యుగాది అంటే సంవత్సరంలో మొదటి రోజు. అందుకే ఈరోజు చాలా పవిత్రంగా భావిస్తారు. ఉగాది రోజున ఉదయం నుంచే పండగ సందడి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉగాది రోజున చాలా ప్రాంతాల్లో దేవతామూర్తులకు ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. ఈ రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పంచాంగ పూజ, పంచాంగ శ్రవణం, ధ్వజారోహాణ కార్యక్రమం, ఉగాది పచ్చడి చేసి దేవుడికి నివేదించి, ప్రసాదంగా స్వీకరిస్తారు. కొంతమంది ఉగాది రోజున కొత్త బట్టలు కట్టుకుని పూజలు చేస్తారు. ఉగాది పచ్చడిని మామిడికాయలు, చింతపండు, ఉప్పు, కారం, బెల్లం,మిరియాలు, వేపపువ్వు లతో తయారు చేస్తారు.

రాబోతున్న క్రోధి నామసంవత్సరం 1904–05, 1964–65 లో వచ్చింది.. మళ్లీ ఇప్పుడు 2024–25లో వస్తుంది. అయితే, అప్పట్లో ఈ ఏడాది మొత్తం మనుషులను భయపెట్టిందని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడైతే జ్యోతిష్యులను కూడా భయపెడుతుంది.

క్రోధి అంటే కోపం, సహనం లేకపోవడం. ఈ ఏడాది పేరుకి తగ్గట్టే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కొన్ని చోట్ల అనవసర వివాదాలు, గొడవలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. కానీ కోపం అంటే మరి అంత చెడ్డ సంవత్సరం అని కాదు. ముఖ్యంగా, మనం చేసే పనులు, కర్మలే ఫలితాలను నిర్ణయిస్తాయి. మంచి పనులు చేస్తే మంచిగా ఉంటుంది, చెడు చేస్తే కర్మ వదలదని జ్యోతిష్యు నిపుణులు అంటున్నారు. 


Similar News