Lord Ganesh : తులసితో పెళ్లిని వినాయకుడు ఎందుకు నిరాకరించాడో తెలుసా..?

తులసితో పెళ్లిని వినాయకుడు ఎందుకు నిరాకరించాడో తెలుసా..

Update: 2024-09-07 04:13 GMT

దిశ, వెబ్ డెస్క్: ఓ వైపు జోరుగా వానలు.. ఇంకో వైపు వినాయక విగ్రహాలను తీసుకెళ్తూ భక్తులు సందడీ మొదలైంది. వర్షాలను కూడా లెక్క చేయకుండా వినాయకుడి కోసం మండపాలు సెట్ చేస్తున్నారు. ఈ మండపాలలో గణేశుడు కొలువు దీరనున్నాడు. ఈ రోజు నుంచి పదకొండు రోజుల పాటు వినాయకుడు పూజలను అందుకోనున్నాడు. అనంతరం డప్పులు, డీజేలతో గణపయ్యను ఊరేగించి నదిలో కానీ చెరువులలో కానీ నిమజ్జనం చేస్తారు.

వినాయక చవితి పండుగ రోజున పత్రాలు, పూలను తీసుకువచ్చి ఆ దేవుడికి పూజిస్తారు. కానీ, ఆ పత్రాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న తులసి ఆకు మాత్రం ఉండదు. ఈ సందేహం ప్రతీ ఒక్కరికి వస్తుంది. అసలు తులసిని గణేశుడు దూరం పెట్టడానికి గల కారణమేంటో ఇక్కడ తెలుసుకుందాం..

పురాణాల ప్రకారం తులసి మొక్క గురించి ఒక కథ ఉంది. అదేమిటంటే, వినాయకుడు నది ఒడ్డును కూర్చుని ధ్యానం చేస్తుంటాడు. అయితే, దూరం నుంచి తులసి అనే ఓ అమ్మాయి వినాయకుడిని చూస్తుంది.. ఆమె చూసిన మొదటి సారికే ప్రేమలో పడి పోతుంది. వినాయకుడి వద్దకు వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోమని కోరుతుంది. అయితే, అందుకు వినాయకుడు ఒప్పుకోడు.. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే నా ధ్యానానికి భంగం కలుగుతుందని చెబుతాడు. దాంతో ఆమె కోపం తెచ్చుకుని నీకు పెళ్లి జరుగునుగాక అని శపిస్తుంది. అప్పుడు వినాయకుడు కూడా తులసికి శాపం పెడతాడు. నీకు ఓ రాక్షసుడిని వివాహమాడి , అతని వల్ల చాలా ఎదుర్కొంటావని శపిస్తాడు. కాగా, వినాయకుడు శాపాన్ని వెనక్కి తీసుకోలేనని, వచ్చే జన్మలో మొక్కగా జన్మించి, ఆ మొక్క లేకుండా కృష్ణుడు పూజ జరగదని తులసికి వరం ఇస్తాడు. శంక చూద అనే రాక్షసున్ని పెళ్లి చేసుకుని.. కొంత కాలం నరకం అనుభవించి, ఆమె మరణిస్తుంది. మళ్లీ తులసి మొక్క రూపంలో జన్మిస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Tags:    

Similar News