ఏ రాశి వారు ఏ మంత్రాన్ని పఠిస్తే లక్ష్మీ దేవి కరుణిస్తుందో తెలుసా..

కొన్ని బీజాక్షరాలను, కొన్ని మంత్రాలను పఠించడం వలన ధైర్యం కలగడమే కాకుండా ఆరోగ్యం కుదుటపడుతుందని పురాణాలు చెబుతున్నాయి.

Update: 2023-12-31 15:40 GMT

దిశ, ఫీచర్స్ : కొన్ని బీజాక్షరాలను, కొన్ని మంత్రాలను పఠించడం వలన ధైర్యం కలగడమే కాకుండా ఆరోగ్యం కుదుటపడుతుందని పురాణాలు చెబుతున్నాయి. గాయత్రి మంత్రం, మహామృత్యుంజయ మంత్రం లాంటి వాటిని పఠిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. అంతేకాదు కొన్ని మంత్రాలను ఆశ్రయించడం వలన భగవంతుని అనుగ్రహం కూడా పొందిన వారు ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. ‘మననాత్‌ త్రాయతే ఇతి మంత్రః’ అంటే నిరంతరం మననం చేయడం వల్ల రక్షించే దాన్ని మంత్రం అన్నారు.

ఇక కొన్ని రాశుల వారికి కొన్ని మంత్రాలు అదృష్టాన్ని తెచ్చిపెడతాయని పండితులు చెబుతున్నారు. జన్మ రాశులను బట్టి లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే ఏ మంత్రాలను జపం చేయాలనేది కొన్ని గ్రంథాల్లో వివరించారు. కొంత మంది జన్మనక్షత్రం, రాశి తెలియక పోయినా వారి పేరును బట్టి కూడా మంత్ర జపం చేయాలన్న విషయాలను కొన్ని గ్రంథాల్లో తెలిపారు. మరి ఏ రాశి వారు ఏ మంత్రాన్ని పఠించాలి ఏ మంత్రాలను జపిస్తే సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకుందాం..

మేష రాశి.. మంత్రం: ఓం ఏం క్లీం సోః

వృషభ రాశి.. మంత్రం: ఓం ఏం క్లీం శ్రీః

మిథున రాశి.. మంత్రం: ఓం క్లీం ఏం సోః

కర్కాటక రాశి.. మంత్రం: ఓం ఏం క్లీం శ్రీః

సింహ రాశి.. మంత్రం: ఓం హ్రీం ఏం సోః

కన్య రాశి.. మంత్రం: ఓం శ్రీం ఏం సోః

తుల రాశి.. మంత్రం: ఓం హ్రీం క్లీం శ్రీంః

వృశ్చిక రాశి.. మంత్రం: ఓం ఏం క్లీం సోః

ధనుస్సు రాశి.. మంత్రం: ఓం హ్రీం క్లీం సోః

మకర రాశి.. మంత్రం: ఓం ఏం క్లీం హ్రీం శ్రీం సోః

కుంభ రాశి.. మంత్రం: ఓం హ్రీం ఏం క్లీం శ్రీం

మీన రాశి.. మంత్రం: ఓం హ్రీం క్లీం సోః

Tags:    

Similar News