ఇంట్లో గంగాజలం ఏ స్థలంలో ఉంచాలో తెలుసా..

హిందూమతంలో గంగా జలానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

Update: 2024-02-03 14:13 GMT
ఇంట్లో గంగాజలం ఏ స్థలంలో ఉంచాలో తెలుసా..
  • whatsapp icon

దిశ, ఫీచర్స్ : హిందూమతంలో గంగా జలానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రాచీన కాలం నుంచి మనదేశంలో గంగా నదిని తల్లిలాగా, అందులోని నీటిని అమృతంగా భావిస్తారు. గంగామాతను మోక్ష ప్రదాయిని అంటారు. అందుకే మరణించిన తర్వాత గంగాజలం నోట్లో పోసే సంప్రదాయం ఉంది. గంగామాత నీరు ఎంతో స్వచ్ఛమైనది. గంగానదిలో హానికరమైన బ్యాక్టీరియా జీవించదు.

మత విశ్వాసాల ప్రకారం గంగానదిలో స్నానం చేయడం వల్ల వ్యక్తి చేసిన పాపాలు పోయి పవిత్రంగా మారతారని పండితులు చెబుతున్నారు. అనేక పర్వదినాలలో లక్షలాది మంది భక్తులు గంగా నదిలో స్నానాలు చేసేందుకు తరలి వస్తుంటారు. పూజలో కూడా పవిత్ర గంగాజలాన్ని పెడితే మంచి జరుగుతుందని చెబుతుంటారు. అందుకే హిందువులు గంగాజలాన్ని తమ ఇంటిలోని పూజగదిలో ఉంచుకుంటారు. అయితే గంగాజలాన్ని ఇంటిలో పెట్టినప్పుడు కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు. అప్పుడే గంగాజలాన్ని ఇంట్లో పెట్టుకున్న ఫలితం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు.

చాలా మంది ప్రజలు ప్లాస్టిక్ సీసాలో లేదా డబ్బాలో గంగాజలాన్ని ఇంటికి తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. అలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. గంగాజలం చాలా పవిత్రమైనది కాబట్టి దాన్ని ఉంచే పాత్ర కూడా స్వచ్ఛంగా ఉండాలి. వెండి, రాగి, ఇత్తడి లేదా మట్టి పాత్రలో గంగాజలాన్ని ఉంచడం మంచిదంటున్నారు. అలాగే గంగాజలాన్ని శుభ్రమైన, చీకటి ప్రదేశంలో పెట్టాలని చెబుతున్నారు. గంగాజలాన్ని ఎండ ఉన్న ప్రదేశంలో లేదా బహిరంగ ప్రదేశంలో ఉంచకూడదు. వంటగది, బాత్రూమ్ పరిసర ప్రాంతాల్లో గంగాజలం ఉంచకూడదు.

పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి..

పూజా స్థలం దగ్గర గంగాజలం ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. మీరు గంగాజలాన్ని ఎక్కడ ఉంచారో ఆ ప్రదేశం శుభ్రంగా ఉండేట్టు శ్రద్ధ వహించాలి.

గంగాజలం ఉంచిన ప్రదేశంలో ఆ పని చేయకూడదు..

గంగాజలాన్ని ఉంచే ప్రదేశం పూర్తిగా స్వచ్ఛంగా ఉండాలి. గంగాజలం ఏదైనా గదిలో ఉంచినట్లయితే, పొరపాటున కూడా ఆ గదిలో మాంసాహారం లేదా మద్యం సేవించకూడదు.

Tags:    

Similar News