Rahu Ketu: జాతకంలో రాహు కేతువు బలంగా ఉండాలంటే శనివారం రోజున ఈ పనులు చేయండి

జ్యోతిష్య శాస్త్రంలో రాహు-కేతువులను అశుభ గ్రహాలుగా చెబుతుంటారు.

Update: 2024-08-04 10:59 GMT

దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రంలో రాహు-కేతువులను అశుభ గ్రహాలుగా చెబుతుంటారు. ఒక మనిషి జాతకంలో రాహు-కేతు దోషం ఉంటే వారు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. రాహువు, కేతువుల అనుగ్రహం కోసం శనివారం రోజున పూజలు చేస్తారు. రాహు, కేతువు ఎవరి జాతకంలో అయితే బలంగా ఉంటారో.. వారు జీవితంలో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. దోషాలతో ఇబ్బంది పడేవారు శనివారం రోజున ఈ పనులు చేయండి.

జాతకంలో రాహువును ప్రసన్నం చేసుకోవడానికి 11 శనివారాలు ఉపవాసం ఉండాలి. ఆ రోజున ఉదయాన్నే తల స్నానం చేసి నల్లని వస్త్రాలు ధరించి ఓం క్రా కేతవే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. రాహువు, కేతువుల అనుగ్రహం పొందడానికి పితృపక్షంలో రావిచెట్టుకు నీటితో పాటు స్వీట్లని సమర్పించాలి. అలాగే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News