హనుమాన్ చిత్రపటాన్ని ఆ ప్రదేశంలో పెడుతున్నారా.. అస్సలు శుభం కాదట..
వాస్తు ప్రకారం హనుమంతుని చిత్రపటాన్ని ఇంట్లో ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
దిశ, ఫీచర్స్ : వాస్తు ప్రకారం హనుమంతుని చిత్రపటాన్ని ఇంట్లో ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాదు అన్ని రకాల భయాల నుండి విముక్తి కూడా లభిస్తుంది. ఇంటి చుట్టూ తిరుగుతున్నప్పుడు హనుమంతుని చిత్రాన్ని చూస్తే, ప్రతి సమస్యలను ఎదుర్కొనే ధైర్యం కూడా పెరుగుతుంది. అయితే వాస్తు నియమాల ప్రకారం హనుమంతుని ఫోటోను ఇంట్లో ఏ ప్రదేశంలో, ఏ దిశలో పెట్టాలో ఆ వాస్తు నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పడకగదిలో హనుమంతుని ఫోటో పెట్టరాదు..
హనుమంతున్ని బ్రహ్మచారిగా పరిగణిస్తారు. అందుకే పొరపాటున కూడా బజరంగబలి ఫోటోని పడకగదిలో పెట్టరాదని పండితులు చెబుతున్నారు. మీకు తెలియకపోతే, మీరు అలాంటి ఫోటోను పడకగదిలో ఉంచినట్లయితే వెంటనే దాన్ని తీసివేయాలి. లేదంటే అశుభ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అంతే కాదు ఏ పనిచేసిన ఆ పనిలో పదే పదే అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుందట.
దక్షిణ దిశలో పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇల్లు లేదా దుకాణంలో హనుమంతుని చిత్రాన్ని దక్షిణ దిశలో ఉంచడం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఈ దిశలో హనుమంతుని ఫోటోను ఉంచడం ద్వారా డబ్బు కొరత ఉండదని చెబుతున్నారు పండితులు. దక్షిణ దిశ నుండి వచ్చే అన్ని రకాల నెగిటివ్ ప్రభావాల నుండి వాయుపుత్రుడు భక్తుల్ని రక్షిస్తాడట.
ఇంట్లోని దోషాలు ఈ చిత్రపటం పెట్టాలి..
పంచముఖి ఆంజనేయస్వామి, హనుమంతుడు పర్వతాన్ని ఎత్తడం లేదా రామ్ భజన పఠించే చిత్రాలను ఇంట్లో ఉంచడం ఉత్తమంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల అన్ని రకాల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో సానుకూలత పెరుగుతుందని నమ్ముతారు. ఇంట్లో పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఇంట్లో అలాంటి చిత్రపటాన్ని పెట్టుకోవాలట. ఇలా చేయడం వల్ల హనుమంతుని విశేష ఆశీస్సులు ఉంటాయని చెబుతున్నారు.
ప్రతికూల శక్తులు తొలగేందుకు..
హనుమంతుని చిత్రాన్ని ఉత్తర దిశలో ఉంచడం ద్వారా, దక్షిణ దిశ నుండి వచ్చే ప్రతి ప్రతికూల శక్తిని హనుమంతుడు ఆపాడు. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును కాపాడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని పెంచుతుంది. వాస్తు ప్రకారం ఉత్తర దిశ చాలా శుభప్రదమైన దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో హనుమంతుడిని పూజించడం వల్ల మీ ఇంట్లో ఆశీర్వాదాలు, సానుకూలత పెరుగుతుంది. హనుమంతుడు తన శక్తిని ప్రదర్శించే ఇంట్లో అలాంటి బొమ్మను ఉంచడం ద్వారా, ఏ విధమైన దుష్టశక్తి ఇంట్లోకి ప్రవేశించదని చెబుతారు.
హనుమంతుని చిత్రం పై సింధూరం..
హనుమంతుని చిత్రపటం పై ప్రతిరోజూ సింధూరాన్ని పూయాలి. ఇలా చేయడం ద్వారా బజరంగబలి భక్తుల మనసులోని మాటను వింటారు. భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తుంది. అయితే స్త్రీలు మాత్రం ఈ పని చేయకూడదు. ఇంటి మగవాళ్ళు ఈ పని చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. ఆంజనేయస్వామి బాల బ్రహ్మచారి కాబట్టి మహిళలు ఆయన విగ్రహాన్ని నేరుగా తాకకూడదని శాస్త్రం చెబుతుంది.