భద్రాద్రి రామయ్య కళ్యాణం ముహూర్తం ఖరారు.. ఏ రోజంటే..?

భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి నాడు నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ ముహుర్తాన్ని వైదిక కమిటీ నిర్ణయించింది.

Update: 2024-02-28 07:15 GMT

దిశ, భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి నాడు నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ ముహుర్తాన్ని వైదిక కమిటీ నిర్ణయించింది.  భద్రాద్రిలో స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోది నామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి మంగళవారం నుంచి చైత్ర శుద్ధ పూర్ణిమ మంగళవారం వరకూ, అనగా ఏప్రిల్ 9 వ తేదీ నుండి 23వ తేదీ వరకూ భద్రాద్రిలో శ్రీస్వామి వారి వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఏప్రిల్ 17 బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకూ మిథలా స్టేడియంలోని కళ్యాణ మండపంలో స్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం శ్రీరామ పునర్వసు దీక్షలు ప్రారంభిస్తారు. ఏప్రిల్ 18వ తేదీ గురువారం శ్రీ స్వామి వారికి మహా పట్టాభిషేకం ఘనంగా జరుగుతుంది. అదేరోజు స్వామి వారికి రధోత్సవం నిర్వహిస్తారు.

Tags:    

Similar News