కేంద్ర పన్నుల వాటా విడుదల

దిశ, న్యూస్‌బ్యూరో: కేంద్ర పన్నుల్లో వాటా(డివల్యూషన్)‌లో భాగంగా రాష్ట్రాలకు రావాల్సిన మే నెల వాయిదా నిధులను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 46,038 కోట్లు ఇవ్వగా తెలంగాణ వాటాగా రూ. 982 కోట్లు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ వాటాగా రూ. 1892.64 కోట్లు విడుదల చేసింది. గడిచిన ఏప్రిల్ నెలలో కూడా తెలుగు రాష్ట్రాలకు ఇంతే మొత్తంలో నిధులను కేంద్రం విడుదల చేసింది. పన్నుల వాటాలో కేంద్రం నిధులలో తెలంగాణకు […]

Update: 2020-05-20 09:13 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కేంద్ర పన్నుల్లో వాటా(డివల్యూషన్)‌లో భాగంగా రాష్ట్రాలకు రావాల్సిన మే నెల వాయిదా నిధులను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 46,038 కోట్లు ఇవ్వగా తెలంగాణ వాటాగా రూ. 982 కోట్లు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ వాటాగా రూ. 1892.64 కోట్లు విడుదల చేసింది. గడిచిన ఏప్రిల్ నెలలో కూడా తెలుగు రాష్ట్రాలకు ఇంతే మొత్తంలో నిధులను కేంద్రం విడుదల చేసింది. పన్నుల వాటాలో కేంద్రం నిధులలో తెలంగాణకు రావాల్సినదాని కన్నా కేంద్ర ప్రభుత్వం తక్కువగా ఇస్తోందని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రతిసారి విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News