మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు
దిశ, న్యూస్‌బ్యూరో: మూసీ నది స్వరూపాన్ని పూర్తిగా మార్చడానికి కావలసిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. ఛైర్మన్ అధ్యక్షతన బుధవారం కార్పొరేషన్ బోర్డు మీటింగ్ నిర్వహించారు. మూసీ కార్పొరేషన్ ఎండీగా విశ్వజిత్ కంపాటి, చీఫ్ ఇంజినీర్ మోహన్ నాయక్ నియమకాలకు బోర్డు ఆమోద ముద్ర వేసింది. అనంతరం దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ రానున్నరోజుల్లో మూసీ రూపురేఖలు మార్చుతామన్నారు. మూసీలో వ్యర్థాల తొలగింపు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఎలాంటి […]
దిశ, న్యూస్‌బ్యూరో: మూసీ నది స్వరూపాన్ని పూర్తిగా మార్చడానికి కావలసిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. ఛైర్మన్ అధ్యక్షతన బుధవారం కార్పొరేషన్ బోర్డు మీటింగ్ నిర్వహించారు. మూసీ కార్పొరేషన్ ఎండీగా విశ్వజిత్ కంపాటి, చీఫ్ ఇంజినీర్ మోహన్ నాయక్ నియమకాలకు బోర్డు ఆమోద ముద్ర వేసింది.
అనంతరం దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ రానున్నరోజుల్లో మూసీ రూపురేఖలు మార్చుతామన్నారు. మూసీలో వ్యర్థాల తొలగింపు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఎలాంటి దుర్గంధం లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీసు (ట్రాఫిక్) అనిల్ కుమార్ పాల్గొన్నారు.