8 రోజుల నుంచి వాటర్లోనే దేవీపట్నం

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా తూర్పు గోదావరి జిల్లా అతలాకుతలమైపోతోంది. ప్రస్తుతం జిల్లాలో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలు నీటమునిగాయి. అటు పలు గ్రామాలకు పూర్తి రాకపోకలు నిలిచిపోయాయి. గత 8 రోజుల నుంచి దేవీపట్నం జలదిగ్భందంలోనే ఉంది. అటు 36 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇందులో 20 గ్రామాలు నేటి వరకు వరద ముంపులోనే ఉన్నాయి. పోచమ్మగండి, తొయ్యేరు, దేవీపట్నంలో పూరిగుడిసెలు […]

Update: 2020-08-20 22:25 GMT

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా తూర్పు గోదావరి జిల్లా అతలాకుతలమైపోతోంది. ప్రస్తుతం జిల్లాలో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలు నీటమునిగాయి. అటు పలు గ్రామాలకు పూర్తి రాకపోకలు నిలిచిపోయాయి. గత 8 రోజుల నుంచి దేవీపట్నం జలదిగ్భందంలోనే ఉంది. అటు 36 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇందులో 20 గ్రామాలు నేటి వరకు వరద ముంపులోనే ఉన్నాయి. పోచమ్మగండి, తొయ్యేరు, దేవీపట్నంలో పూరిగుడిసెలు కొట్టుకుపోయాయి. ఇళ్లు నేలకూలడంతో బాధితులు ఆందోళనచెందుతున్నారు.

Tags:    

Similar News