శరద్ పవార్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌తో ఆయన నివాసంలో సోమవారం ఉదయం సమావేశమయ్యారు. శివసేన ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ, విమర్శలు చేసే ఫడ్నవీస్ అధికార కూటమిలోని పార్టీ చీఫ్‌తో భేటీ కావడంపై రాజకీయవర్గాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. శరద్ పవార్ ఇటీవలే పిత్తాశయానికి ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఈ ఆపరేషన్ నుంచి కోలుకున్నారు. ఈ తరుణంలోనే ఆయనను కలిసి ఫడ్నవీస్ ఇది కేవలం గౌరవపూర్వక భేటీ మాత్రమేనని అనంతరం […]

Update: 2021-05-31 12:00 GMT

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌తో ఆయన నివాసంలో సోమవారం ఉదయం సమావేశమయ్యారు. శివసేన ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ, విమర్శలు చేసే ఫడ్నవీస్ అధికార కూటమిలోని పార్టీ చీఫ్‌తో భేటీ కావడంపై రాజకీయవర్గాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. శరద్ పవార్ ఇటీవలే పిత్తాశయానికి ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఈ ఆపరేషన్ నుంచి కోలుకున్నారు. ఈ తరుణంలోనే ఆయనను కలిసి ఫడ్నవీస్ ఇది కేవలం గౌరవపూర్వక భేటీ మాత్రమేనని అనంతరం ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ ఇష్యూపై జూన్ 5న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దమొత్తంలో ప్రతిపక్ష బీజేపీ ప్లాన్ వేస్తుండటం గమనార్హం.

Tags:    

Similar News