ఆస్తుల కోసమే అమరావతి అంటున్నారు

దిశ, ఏపీ బ్యూరో: 13జిల్లాల అభివృద్ధే సీఎం జగన్‌ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానుల ప్రతిపాదనను అన్ని జిల్లాల ప్రజలు హర్షిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు, అతని పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. బినామీ ఆస్తులను కాపాడుకునేందుకే చంద్రబాబు అమరావతి అంటున్నారని దుయ్యబట్టారు. రూ.5కోట్లు మట్టిలో పోసి ప్రజలకు రాజధాని చిత్రాలు చూపించారని ఎద్దేవా చేశారు. విశాఖ భూ కుంభకోణంపై త్వరలోనే సిట్‌ […]

Update: 2020-10-11 08:11 GMT

దిశ, ఏపీ బ్యూరో: 13జిల్లాల అభివృద్ధే సీఎం జగన్‌ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానుల ప్రతిపాదనను అన్ని జిల్లాల ప్రజలు హర్షిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు, అతని పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. బినామీ ఆస్తులను కాపాడుకునేందుకే చంద్రబాబు అమరావతి అంటున్నారని దుయ్యబట్టారు. రూ.5కోట్లు మట్టిలో పోసి ప్రజలకు రాజధాని చిత్రాలు చూపించారని ఎద్దేవా చేశారు. విశాఖ భూ కుంభకోణంపై త్వరలోనే సిట్‌ దర్యాప్తు పూర్తవుతుందన్నారు. మాన్సాస్‌ వ్యవహారం కుటుంబ తగదా అని ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు, హైకోర్టుపై తమకు గౌరవం, రాజ్యాంగంపై విశ్వాసం ఉందని మంత్రి బొత్స తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ రూపంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అన్ని అంశాలు వివరించారని తెలిపారు.

Tags:    

Similar News