‘విజయ్’ సాయంతో విజయం

         హీరో విజయ్ దేవరకొండ మాటలు ఎంత ప్రాక్టికల్‌గా ఉంటాయో చేతలు కూడా అలాగే ఉంటాయని చాలా సార్లు రుజువు చేశాడు. కొన్నేళ్ల క్రితం దేవరకొండ ఫౌండేషన్‌ను స్థాపించిన విజయ్.. పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. దాదాపు మూడేండ్లుగా దేవరకొండ శాంటా పేరుతో క్రిస్మస్‌కు అభిమానుల అవసరాలను తీరుస్తూ వస్తున్నారు. సమాజానికి సేవ చేయాలని ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్టు విజయ్ చెప్పారు. ఈ క్రమంలో దేవరకొండ ఫౌండేషన్ ఆర్థిక సాయంతో ఓ […]

Update: 2020-02-15 04:38 GMT

హీరో విజయ్ దేవరకొండ మాటలు ఎంత ప్రాక్టికల్‌గా ఉంటాయో చేతలు కూడా అలాగే ఉంటాయని చాలా సార్లు రుజువు చేశాడు. కొన్నేళ్ల క్రితం దేవరకొండ ఫౌండేషన్‌ను స్థాపించిన విజయ్.. పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. దాదాపు మూడేండ్లుగా దేవరకొండ శాంటా పేరుతో క్రిస్మస్‌కు అభిమానుల అవసరాలను తీరుస్తూ వస్తున్నారు. సమాజానికి సేవ చేయాలని ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్టు విజయ్ చెప్పారు. ఈ క్రమంలో దేవరకొండ ఫౌండేషన్ ఆర్థిక సాయంతో ఓ క్రీడాకారుడు తన కలను సాకారం చేసుకున్నాడు. మెదక్ జిల్లాకు చెందిన గణేష్ ఎంబారి న్యూ ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ కిక్ బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే, అందుకు కావాల్సిన పార్టిసిపేషన్ ఫీజు లేక పోటీలకు దూరంగా ఉండాలనే నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న దేవరకొండ ఫ్యామిలీ గణేష్‌కు సపోర్ట్‌గా నిలిచింది. ఫిబ్రవరి 1న దేవరకొండ విజయ్ తండ్రి గోవర్ధన్ రావు క్రీడాకారుడికి రూ.24వేల విలువైన చెక్‌ను అందించాడు. దీంతో ఈ నెల 13న పోటీల్లో పాల్గొన్న గణేష్ బంగారు పతకాన్ని సాధించాడు. తన కలను సాకారం చేసిన విజయ్ దేవరకొండకు గణేష్ ధన్యవాదాలు తెలిపాడు. తన విజయానికి కారణం విజయ్ అని గర్వంగా చెప్పాడు.

Tags:    

Similar News