బట్టలు లేకుండా మంగళసూత్ర ప్రకటనేంటి.. యాడ్‌పై నెటిజన్ల ఫైర్!

దిశ, ఫీచర్స్: ఇటీవల కాలంలో భారతీయ హిందూ పండుగలు, సంప్రదాయాలను టార్గెట్ చేస్తూ వస్తున్న ప్రకటనలు నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాయి. దీంతో కంపెనీలు వెనక్కి తగ్గి యాడ్స్‌‌ను డిలీట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ‘సబ్యసాచి’ బ్రాండ్ ‘మంగళసూత్ర’ యాడ్‌ కూడా చాలా అసభ్యంగా ఉండటంతో సోషల్ మీడియాలో మరోసారి వార్ మొదలైంది. భారతీయ సంప్రదాయాలను కించపరుస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ తన కొత్త ఆభరణాల ‘ఇంటిమేట్ ఫైన్ జూవెల్లరీ’ కలెక్షన్స్ ధరించిన మోడల్స్ […]

Update: 2021-10-29 05:03 GMT

దిశ, ఫీచర్స్: ఇటీవల కాలంలో భారతీయ హిందూ పండుగలు, సంప్రదాయాలను టార్గెట్ చేస్తూ వస్తున్న ప్రకటనలు నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాయి. దీంతో కంపెనీలు వెనక్కి తగ్గి యాడ్స్‌‌ను డిలీట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ‘సబ్యసాచి’ బ్రాండ్ ‘మంగళసూత్ర’ యాడ్‌ కూడా చాలా అసభ్యంగా ఉండటంతో సోషల్ మీడియాలో మరోసారి వార్ మొదలైంది. భారతీయ సంప్రదాయాలను కించపరుస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ తన కొత్త ఆభరణాల ‘ఇంటిమేట్ ఫైన్ జూవెల్లరీ’ కలెక్షన్స్ ధరించిన మోడల్స్ చిత్రాల సిరీస్‌ను విడుదల చేశారు. ప్రచార ప్రకటనలో భార్యభర్తలతో పాటు స్వలింగ జంటలు ‘ది రాయల్ బెంగాల్’ మంగళసూత్రాన్ని ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. అయితే ప్రమోషనల్ ఫోటోషూట్‌లో మంగళసూత్రంతో పాటు నల్లని బ్రాసియర్‌ను ధరించిన ఫీమేల్ మోడల్.. చొక్కా లేని పురుషుడిపై తలవాల్చి ఉంది. మహిళలు పవిత్రంగా భావించే మంగళసూత్రం గురించి పవిత్రమైన ప్రకటన ప్లాన్ చేయకుండా.. ఓ లోదుస్తుల యాడ్‌లాగా మార్చేయడంపై నెటిజన్లు ఆగ్రహానికి గురయ్యారు. దీన్ని హిందూ సంస్కృతిపై దాడిగా అభివర్ణించారు.

‘ఆభరణాలు అందమైన కళాఖండాలలో ఒకటి.. మంచి మార్గంలో (sic) ప్రచారం చేయాలి కానీ ఇలా అశ్లీలతను ఆశ్రయించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది మీకు అసంబద్ధంగా అనిపించడం లేదా?. మంగళసూత్రాన్ని, భారతీయ సంప్రదాయాలను కించపరచడమే మీ ఉద్దేశమా?. ఇలా మంగళసూత్రాన్ని ఎవరు అమ్ముతున్నారు. బురఖా, తాబీజ్‌లను ఈ పద్ధతిలో అమ్మే ధైర్యం ఉందా?. ఇది అవమానకరమైన చర్య. @sabya_mukherjee మీరు #intimatefinejewellerybysabyasachi అనే హ్యాష్‌ట్యాగ్‌తో నగ్నత్వం, అశ్లీల కంటెంట్‌ను ప్రచారం చేయడం ద్వారా మంగళసూత్రాన్ని విక్రయిస్తున్నారు. ఇది హిందువుల సంస్కృతీ సంప్రదాయాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడమే. ఈ పోస్ట్‌ను వీలైనంత త్వరగా తొలగించండి’ అని డిమాండ్ చేశారు.

ఇండియన్ క్లాతింగ్ బ్రాండ్ ఫాబిండియా ‘జష్న్-ఎ-రివాజ్’ అనే దుస్తుల కలెక్షన్స్‌కు సంబంధించిన ఓ ప్రకటనును అక్టోబర్ 19న విడుదల చేశారు. కానీ ఇందులో ఏ ఒక్క మోడల్ కూడా బొట్టు పెట్టుకోకపోవడం, దీపావళిని ఉర్దూ పదంతో ముడిపెట్టడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. డాబర్ ‘ఫెమ్’ బ్రాండ్ కూడా హిందూ సాంప్రదాయాలకు విరుద్ధంగా ‘కర్వా చౌత్’ యాడ్‌ను రూపొందించిందని ట్రోల్స్ ఎదుర్కొంది.

https://twitter.com/immortalsoulin/status/1453322750014091267?s=20

Tags:    

Similar News