కరోనా సోకి డిప్యూటీ మేజిస్ట్రేట్ మృతి
కోల్ కతా: కరోనా వైరస్ చాలామందిని పొట్టనబెట్టుకున్నది. తాజాగా పశ్చిమబెంగాల్ లో సబ్ డివిజన్ డిప్యూటీ మేజిస్ట్రేట్ దేద్ దత్తా(38) కరోనా సోకి మృతిచెందారు. కరోనా కట్టడి విషయంలో ఆమె ముందుండి సేవలందించిన ఆ అధికారి కరోనా సోకి మృతిచెందింది. దీంతో ఆమె సహోద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె సేవలను గుర్తు చేస్తూ కన్నీరుమున్నీరయ్యారు. కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న ఆమె ఈటీవలే హోం ఐసోలేషన్ కు వెళ్లారు. అయితే అకస్మాత్తుగా ఆదివారం రోజు పరిస్థితి […]
కోల్ కతా: కరోనా వైరస్ చాలామందిని పొట్టనబెట్టుకున్నది. తాజాగా పశ్చిమబెంగాల్ లో సబ్ డివిజన్ డిప్యూటీ మేజిస్ట్రేట్ దేద్ దత్తా(38) కరోనా సోకి మృతిచెందారు. కరోనా కట్టడి విషయంలో ఆమె ముందుండి సేవలందించిన ఆ అధికారి కరోనా సోకి మృతిచెందింది. దీంతో ఆమె సహోద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె సేవలను గుర్తు చేస్తూ కన్నీరుమున్నీరయ్యారు. కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న ఆమె ఈటీవలే హోం ఐసోలేషన్ కు వెళ్లారు. అయితే అకస్మాత్తుగా ఆదివారం రోజు పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆమెకు భర్త, నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే.. ఆమె హుగ్లీ జిల్లాలోని చందానగర్ సబ్ డివిజన్ డిప్యూటీ మేజిస్ట్రేట్ గా విధులు నిర్వర్తించారు.