చార్మినార్, గోల్కొండకు నో ఎంట్రీ
దిశ ప్రతినిధి , హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతిరోజు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలోని ప్రముఖ చారిత్రాత్మక కట్టడాలుగా గుర్తింపు పొందిన గోల్కొండ, చార్మినార్ ప్రాంతాల సందర్శనను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర పురావస్తు శాఖ ఉత్తర్వులు ఆధారంగా శుక్రవారం నుండి అధికారులు గోల్కొండ, చార్మినార్ సందర్శనను నిలిపివేశారు. మే 15వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, ఎట్టి పరిస్థితులలోనూ సందర్శకులను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. కరోనా తీవ్రత […]
దిశ ప్రతినిధి , హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతిరోజు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలోని ప్రముఖ చారిత్రాత్మక కట్టడాలుగా గుర్తింపు పొందిన గోల్కొండ, చార్మినార్ ప్రాంతాల సందర్శనను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర పురావస్తు శాఖ ఉత్తర్వులు ఆధారంగా శుక్రవారం నుండి అధికారులు గోల్కొండ, చార్మినార్ సందర్శనను నిలిపివేశారు.
మే 15వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, ఎట్టి పరిస్థితులలోనూ సందర్శకులను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. కరోనా తీవ్రత పరిస్థితిని బట్టి ఈ గడువు పెంచే అవకాశం కూడా లేకపోలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నగరంలోని కుతుబ్‌షాహీ టూమ్స్, సాలార్‌జంగ్ మ్యూజియం, ఇతర పర్యాటక ప్రాంతాల మూసివేతపై ఎలాంటి ప్రకటన చేయలేదు.