ఆ దారులన్నీ క్లోజ్..
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సచివాలయం పాత భవనాల కూల్చివేత పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి.దీంతో ఆ దారిగుండా రాకపోకలను మూసివేశారు.వాహనాలతో సహా ఎవరినీ అనుమతించేది లేదని పోలీసులు స్పష్టంచేశారు.సోమవారం అర్థరాత్రి నుంచి కూల్చివేత పనులు ప్రారంభం కాగా, వెస్టేజీని పలు వాహనాల ద్వారా తరిలిస్తున్నట్టు సమాచారం.ఆర్ అండ్ బీ అధ్వర్యంలో డెమోలిషన్ పనులు జరుగుతుండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు. పాత సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో […]
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సచివాలయం పాత భవనాల కూల్చివేత పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి.దీంతో ఆ దారిగుండా రాకపోకలను మూసివేశారు.వాహనాలతో సహా ఎవరినీ అనుమతించేది లేదని పోలీసులు స్పష్టంచేశారు.సోమవారం అర్థరాత్రి నుంచి కూల్చివేత పనులు ప్రారంభం కాగా, వెస్టేజీని పలు వాహనాల ద్వారా తరిలిస్తున్నట్టు సమాచారం.ఆర్ అండ్ బీ అధ్వర్యంలో డెమోలిషన్ పనులు జరుగుతుండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు. పాత సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సర్కారుకున్న అడ్డంకులు తొలగిన విషయం తెలిసిందే.