వరవరరావును విడుదల చేయాలి
దిశ, క్రైమ్‌బ్యూరో: ప్రముఖ కవి వరవరరావును బేషరతుగా విడుదల చేయాలని ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక డిమాండ్ చేసింది. సంస్థ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు దేవకీదేవి, ఏపీ అధ్యక్షురాలు కేఎన్ మల్లీశ్వరీలు శనివారం విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో వరవరరావు వయసు, కరోనా పరిస్థితిని, ఖైదీలతో కిక్కిరిసిన జైళ్లను దృష్టిలో ఉంచుకొని విడుదల చేయాలని పేర్కొన్నారు. బీమా కోరేగావ్ కేసులో అరెస్టు చేసి అండర్ ట్రయల్ ఖైదీగా తలోజా జైల్లో […]
దిశ, క్రైమ్‌బ్యూరో: ప్రముఖ కవి వరవరరావును బేషరతుగా విడుదల చేయాలని ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక డిమాండ్ చేసింది. సంస్థ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు దేవకీదేవి, ఏపీ అధ్యక్షురాలు కేఎన్ మల్లీశ్వరీలు శనివారం విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో వరవరరావు వయసు, కరోనా పరిస్థితిని, ఖైదీలతో కిక్కిరిసిన జైళ్లను దృష్టిలో ఉంచుకొని విడుదల చేయాలని పేర్కొన్నారు. బీమా కోరేగావ్ కేసులో అరెస్టు చేసి అండర్ ట్రయల్ ఖైదీగా తలోజా జైల్లో ఉంచారని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న వరవరరావును విడుదల చేయాలని కోరారు. ఆయన విడుదల కోసం పౌర సమాజం కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతోందన్నారు. కస్టడీలో ఉన్న వ్యక్తి ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చట్టబద్ధంగా నైతికం కాదన్నారు.