కల్వర్టులు నిర్మించాలని డిమాండ్..!

దిశ, హుస్నాబాద్: ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రం నుంచి పలు గ్రామాలకు వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. దీంతో కల్వర్టులు నిర్మించాలని కరీంనగర్ పార్లమెంటరీ కోఆర్డినేటర్ పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. దీంతో బెజ్జంకి నుంచి గూడెం, లక్ష్మీపూర్, తలరివానిపల్లి, వడ్లూర్ బేగంపేట ప్రజలు గ్రామాలకు వెళ్లాలంటే 20 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందని విమర్శించారు. రహదారులపై బిడ్జిలు […]

Update: 2020-09-26 04:38 GMT

దిశ, హుస్నాబాద్: ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రం నుంచి పలు గ్రామాలకు వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. దీంతో కల్వర్టులు నిర్మించాలని కరీంనగర్ పార్లమెంటరీ కోఆర్డినేటర్ పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోరారు.

ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. దీంతో బెజ్జంకి నుంచి గూడెం, లక్ష్మీపూర్, తలరివానిపల్లి, వడ్లూర్ బేగంపేట ప్రజలు గ్రామాలకు వెళ్లాలంటే 20 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందని విమర్శించారు. రహదారులపై బిడ్జిలు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని పలు గ్రామాలకు చెందిన 700మందితో సంతకాలను తీసుకోని కరీంనగర్ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బీ అధికారులకు వినతి పత్రాన్ని అందజేసినట్లు గుర్తుచేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామస్తులకు బిడ్జిలు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News